ఉత్తరాఖండ్ లో 2,300 మంది పోలీసులకు కరోనా

ఉత్తరాఖండ్ పోలీస్ విభాగంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 2,300 మంది పోలీసులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. అయితే వారిలో 93 శాతం మంది అంటే 2,204 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఇక పోలీసుల కుటుంబ సభ్యుల్లోనూ 751 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా ఫస్ట్ వేవ్ తో పోల్చితే మహమ్మారి బారిన పడిన పోలీస్ ల సంఖ్య సెకండ్ వేవ్ లోనే ఎక్కువగా ఉంది. కరోనా ఫస్ట్ […]

Written By: Velishala Suresh, Updated On : June 3, 2021 2:02 pm
Follow us on

ఉత్తరాఖండ్ పోలీస్ విభాగంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 2,300 మంది పోలీసులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. అయితే వారిలో 93 శాతం మంది అంటే 2,204 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఇక పోలీసుల కుటుంబ సభ్యుల్లోనూ 751 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా ఫస్ట్ వేవ్ తో పోల్చితే మహమ్మారి బారిన పడిన పోలీస్ ల సంఖ్య సెకండ్ వేవ్ లోనే ఎక్కువగా ఉంది. కరోనా ఫస్ట్ వేవ్ లో 1982 మంది ఉత్తరాఖండ్ పోలీసులకు వైరస్ సోకింది. ఇప్పటి వరకు మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు.