
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ తయారు చేసేందుకు సీరం ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిద్ధం అయ్యింది. ఇందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా స్పుత్రిక్ ప్రయోగ ఫలితాల విశ్లేషణకు అనుమతిని కోరినట్లు సమాచారం. రష్యన్ డైరెక్ట ఇన్వెస్టిమెంట్ ఫండ్ సహకారంతో గమలేయా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ను భారత్ లో తయారు, సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం చేసుకుంది.