KCR VS BJP: బీజేపీ బుట్టలో పడిందా? కేసీఆర్ ప్లాన్ సక్సెస్?

KCR VS BJP: మాయల మరాఠి.. రాజకీయ చాణక్యుడు.. రాజకీయాలను ఒక్కరోజులో మలుపుతిప్పే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీజేపీ గేమ్స్ జాగ్రత్తగా ఆడాలి. ఎక్కడ తేడాకొట్టినా ఆ పార్టీ కోలుకోకుండా దెబ్బతింటుంది. హుజూరాబాద్ గెలుపుతో ఇప్పుడు బీజేపీకి మంచి ఊపు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలంగాణలో అధికారం తమదే అని.. అధికార టీఆర్ఎష్ కు తామే ప్రత్యామ్మాయం అని పదే పదే చెబుతున్న బీజేపీ.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తమ […]

Written By: NARESH, Updated On : November 13, 2021 3:01 pm
Follow us on

KCR VS BJP: మాయల మరాఠి.. రాజకీయ చాణక్యుడు.. రాజకీయాలను ఒక్కరోజులో మలుపుతిప్పే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీజేపీ గేమ్స్ జాగ్రత్తగా ఆడాలి. ఎక్కడ తేడాకొట్టినా ఆ పార్టీ కోలుకోకుండా దెబ్బతింటుంది. హుజూరాబాద్ గెలుపుతో ఇప్పుడు బీజేపీకి మంచి ఊపు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలంగాణలో అధికారం తమదే అని.. అధికార టీఆర్ఎష్ కు తామే ప్రత్యామ్మాయం అని పదే పదే చెబుతున్న బీజేపీ.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తమ వాదనకు బలం చేకూరిందని భావిస్తోంది.

kcr bjp

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పై బీజేపీ విజయం సాధించిన తర్వాత తెలంగాణలో బీజేపీ అంతో ఇంతో బలపడుతోందని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారని వార్తలు వస్తున్నాయి.

Also Read: KCR vs BJP: ఏకుమేకవుతున్న బీజేపీ.. కేసీఆర్ లో అందుకేనా ఫస్ట్రేషన్?

అందుకే కీలకమైన సమస్య అయిన రాష్ట్రంలో రైతాంగం పండించిన వరిని కేంద్రం కొనడం లేదంటూ వ్యూహాత్మకంగా బీజేపీపై నెపం నెట్టే ప్రయత్నాన్ని కేసీఆర్ చేశారు. రెండు రోజుల పాటు వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రంగా విమర్శలు చేశారు. అంతేకాదు.. కేంద్రం తీరుకు నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు కూడా చేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా టీఆర్ఎస్ వర్గాలు చేస్తున్నాయి.

అయితే కేసీఆర్ మీడియా సమావేశం తరువాత హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు అంశంపై చర్చ పక్కకు పోయిందని.. ఇలా చేయడంలో సీఎం కేసీఆర్ ఒక రకంగా సక్సెస్ అయ్యారని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక వరి కొనడం లేదంటూ కేసీఆర్ లేవనెత్తిన అంశంలో బీజేపీ సరైన కౌంటర్ సమర్థింపు చేసుకోవడంలో విఫలమైందన్న టాక్ వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ధర్నాలకు బీజేపీ పోటీ ధర్నాలకు నిర్ణయం తీసుకోవడంతో కేసీఆర్ ట్రాప్ లో బీజేపీ పడిపోయిందని అర్థమవుతోంది. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలకు బీజేపీ రియాక్ట్ అయ్యి బుట్టలో పడిపోతోందన్న టాక్ నడుస్తోంది.

బీజేపీని ఎదుర్కోవడానికి బలమైన అభ్యర్థులను టీఆర్ఎస్ తరుఫున నిలబెట్టాలని డిసైడ్ అయ్యాడట.. బీజేపీకి ఉన్న అభ్యర్థుల కొరతను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. మరి ఇది ఎలాంటి ఫలితం అందిస్తుందనేది వేచిచూడాలి.

Also Read: KCR: కేసీఆర్ నిర్ణ‌యంతో బీజేపీలోకి టీఆర్ఎస్ నాయ‌కులు ?