https://oktelugu.com/

Vijay Devarakonda: లైగర్ హిందీ వర్షన్ కోసం స్పెషల్ ప్లాన్ వేసిన… విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబో లో తెరకెక్కుతున్న చిత్రం “లైగర్”.  భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ కి జంటగా బాలీవుడ్ హాట్ భామ అనన్య పాండే నటిస్తుంది. ఈ చిత్రానికి పూరిజగన్నాథ్, ఛార్మి, కరణ్ జొహార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల దీపావళి సందర్భంగా ఈ మూవీ నుండి బాక్సింగ్ ఛాంపియన్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 11, 2021 / 07:01 PM IST
    Follow us on

    Vijay Devarakonda: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబో లో తెరకెక్కుతున్న చిత్రం “లైగర్”.  భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ కి జంటగా బాలీవుడ్ హాట్ భామ అనన్య పాండే నటిస్తుంది. ఈ చిత్రానికి పూరిజగన్నాథ్, ఛార్మి, కరణ్ జొహార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల దీపావళి సందర్భంగా ఈ మూవీ నుండి బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.

    హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ ఈ చిత్రంలో నటించడంతో ఈ చిత్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అలానే   అభిమానులలో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి చివరి షూటింగ్ షెడ్యూల్ ను అమెరికాలో చేయనున్నారు. ఈ సినిమా నుండి తాజాగా మరో కొత్త సమాచారం తెలిసింది.

    హిందీ వెర్షన్ లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు విజయ్. అయితే విజయ్ కు హిందీ బాగా వచ్చు కాబట్టి డబ్బింగ్ చెప్పడానికి పెద్ద సమస్య కూడా ఉండకపోవచ్చు. చూడాలి మరి హిందీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో ఈ రౌడీ స్టార్. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో విజయ్ కి  క్రేజ్ పెరుగుతుందేమో అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అలానే నటుడిగా మాత్రమ కాకుండా నిర్మాతగా కూడా దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే రెండు మూడు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు విజయ్.