IRCTC డౌన్ : దూర ప్రయాణాలు చేయాలి అనుకునే చాలా మంది కూడా రైల్వేను ఎంచుకుంటారు. తక్కువ ఖర్చు, సేఫ్ జర్నీ అని చాలా మంది ప్రయాణీకులు ఈ సేవలను ఎంచుకుంటారు. ఇక కొత్త సంవత్సరానికి ఒకటే రోజు ఉంది. ఈ రోజు డిసెంబర్ 31. సో చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ రెండు రోజులను ఎంజాయ్ చేయడానికి చాలా మంది నెల ముందే ప్లాన్ చేసుకున్నారు. కొందరు సడన్ గా ప్లాన్ చేసుకొని మరీ వెళ్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో ట్రైన్ బుకింగ్ సైట్ అంటే IRCTC సైట్ డౌన్ అయితే ఎలా ఉంటుంది. టికెట్లు ఎలా తీసుకుంటారు. బుకింగ్ ఎలా చేసుకుంటారు? అవును నిజమే. ఈ రోజు ఇదే జరిగింది. ఇంతకీ ఏం జరిగింది అంటే?
IRCTC సర్వర్ ఈ నెలలో మూడవసారి డౌన్ అయింది. తత్కాల్ టికెట్ బుకింగ్ అవడం లేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్ డిసెంబర్ 31వ తేదీ అంటే ఈ రోజు ఉదయం నుంచి ఎర్రర్ వస్తుంది. దీని కారణంగా కీలక సమయంలో తత్కాల్ టిక్కెట్ బుకింగ్ జరగడం లేదు. డిసెంబర్‌లో IRCTC యాప్, వెబ్‌సైట్ సర్వర్లు పనిచేయకపోవడం ఇది మూడోసారి. ఉదయం 9.50 గంటల ప్రాంతంలో మూడు సార్లు లోపం వచ్చింది.
డిసెంబర్ 31, 2024 ఉదయం 11:29 గంటలకు మళ్లీ దీన్ని అప్డేట్ చేశారు. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఈ సాంకేతిక సమస్య ఉదయం 9.50 గంటలకు ప్రారంభమైంది. గత వారం కూడా IRCTC సర్వర్‌లలో ఇలాంటి లోపం ఏర్పడింది. సర్వర్ షట్‌డౌన్ కారణంగా, దేశవ్యాప్తంగా వినియోగదారులు తత్కాల్ టిక్కెట్‌లను బుక్ చేసుకోలేకపోయారు. ఇక ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రయాణికులకు కూడా ఇబ్బంది ఎదురు అయింది.
అయితే ఒక గంట వరకు అన్ని సైట్‌లకు బుకింగ్ రద్దు చేయడం అందుబాటులో లేదు. అందుకే ఈ అసౌకర్యానికి చింతిస్తూ రద్దు/TDRని ఫైల్ చేయడానికి దయచేసి 14646,08044647999 నంబర్‌లకు కాల్ చేయండని లేదా 08035734999 లేదా [email protected] కి మెయిల్ చేయండి అని తెలిపారు అధికారులు.
ఇదిలా ఉంటే ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ సమస్య తలెత్తింది. IRCTC వెబ్‌సైట్, యాప్ డౌన్ కావడం ఒక వారం వ్యవధిలోనే ఇది రెండోసారి. డిసెంబరు 26న కూడా ఇదే సమస్య నమోదైంది. దీంతో రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియా ద్వారా అంతరాయం గురించి ఫిర్యాదు చేశారు. డౌన్‌డెటెక్టర్ ప్రకారం , దాదాపు 47 శాతం మంది వినియోగదారులు వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. అయితే 42% మంది యాప్‌తో సమస్యలను ఎదుర్కొన్నారు. కొందరు టికెట్ బుకింగ్ మధ్యలో ఉన్నప్పుడే ఈ సమస్య రావడంతో ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే మంగళవారం ఉదయం 9.48 గంటల వరకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదు.