https://oktelugu.com/

Women Health: మహిళలు అతిగా ఆలోచిస్తున్నారా.. మీరు డేంజర్‌లో పడినట్లే!

మితిమీరిన ఆలోచన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇది మన మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. ఏ విషయం గురించి అయిన ఆలోచించడం మంచిదే. కానీ అతిగా ఆలోచిస్తే అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఏ సమస్య వచ్చిన కూడా ఎక్కువగా ఆలోచిస్తారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 1, 2025 / 02:14 AM IST

    women health issue

    Follow us on

    Women Health: మితిమీరిన ఆలోచన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇది మన మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. ఏ విషయం గురించి అయిన ఆలోచించడం మంచిదే. కానీ అతిగా ఆలోచిస్తే అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఏ సమస్య వచ్చిన కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రతీ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసుకుంటారు. మహిళలకు ఇలా అతి ఆలోచన ఉండటం కరెక్ట్ కాదని నిపుణులు చెబుతున్నారు. అతిగా ఆలోచించే మహిళలు ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. అతిగా ఆలోచించడం మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అతిగా ఆలోచించడం అనేది ఒక అంటువ్యాధి వంటిదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా యంగ్ ఏజ్‌లో ఉన్నవారిలో ఉంటుంది. వృద్ధుల్లో అయితే అసలు ఉండదు. 45-55 సంవత్సరాల వయస్సు గల వారు 52 శాతం, 65-75 సంవత్సరాలలో కేవలం 20 శాతం, 25-35 సంవత్సరాల వయస్సు గల వారు 73 శాతం అతిగా ఆలోచిస్తారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి అతిగా ఆలోచించడం వల్ల మహిళల్లో వచ్చే ఆ అనారోగ్య సమస్యలేంటో చూద్దాం.

    మెదడుపై ప్రభావం
    ఎక్కువగా ఆలోచిస్తే మెదడుపై ప్రభావం పడుతుంది. దీంతో తీవ్రంగా ఒత్తిడికి గురవుతారు. అతి ఆలోచన కార్టిసాల్ హిప్పోకాంపస్‌లోని మెదడు కణాలను దెబ్బతీస్తాయి. దీంతో మీరు ఆలోచించే విధానం మారిపోతుంది. దీంతో మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    జీర్ణ సమస్యలు
    అతిగా ఆలోచించడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడికి గురికావడం వల్ల ఇన్‌ఫ్లమేటరీ ప్రేగు వ్యాధులు, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మహిళలు ఎక్కువగా ఆలోచించవద్దు. ఏ విషయాన్ని అయిన కూల్‌గా పరిష్కరించుకోవడం అలవాటు చేసుకోండి.

    చర్మ సమస్యలు
    అతిగా ఆలోచిస్తే ఒత్తిడికి గురవుతారు. అది చర్మంపై ప్రభావం చూపుతుంది. మానసిక ఒత్తిడి వల్ల సోరియాసిస్, అటోపిక్ డెర్మటైటిస్, ప్రురిటస్, అలోపేసియా, అరేటా, సెబోర్హీక్ డెర్మటైటిస్ వంటి చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే చర్మంపై మంటకు కూడా కొన్నిసార్లు దారితీస్తుంది. చర్మం కాంతివంతంగా ఉండదు. ముడతలు, మొటిమలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. తొందరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి.

    రోగనిరోధక శక్తి తగ్గుదల
    బాగా ఒత్తిడికి గురైనప్పుడు రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అలాగే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్‌ను పెంచే కారకాలు ఒత్తిడి వల్ల పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ వంటివి వస్తాయని హెచ్చరిస్తున్నారు. మహిళలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిగా ఆలోచించకూడదు. ఇలా ఆలోచిస్తే కోరి మరి సమస్యలను తెచ్చుకున్నట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.