https://oktelugu.com/

New Year : మీ ఫ్రెండ్స్, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి..

2024 కు బాయ్ బాయ్ చెప్పి 2025 కు వెల్ కమ్ చెప్పేయండి డియర్స్. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, సుఖాల మధ్య గడిచిందా ఈ సంవత్సరం?

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 1, 2025 / 01:30 AM IST

    New Year

    Follow us on

    New Year : 2024 కు బాయ్ బాయ్ చెప్పి 2025 కు వెల్ కమ్ చెప్పేయండి డియర్స్. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, సుఖాల మధ్య గడిచిందా ఈ సంవత్సరం? ఎలాంటి సన్నివేశాల మధ్య, విషయాల మధ్య ఈ సంవత్సరం మీకు గడిచినా సరే వాటిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ సంవత్సరానికి గుడ్ బాయ్ చెప్పేయండి. తిరిగి రాని ఆ రోజులు సంతోషాన్ని తెచ్చిపెట్టినా, దు:ఖాన్ని మిగిల్చిన సరే అవి ఇక రాని రోజులే అని కచ్చితంగా అర్థం చేసుకోండి. మీ ఆత్మీయులకు, మీకు ఫ్యామిలీ మెంబర్స్ కు ఈ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయండి. దానికి మీకు మేము సహాయం చేస్తాము కదా. మరీ ఈ గ్రీటింగ్స్ వారికి ఫార్వర్డ్ చేసేయండి.

    పాత జ్ఞాపకాలకు బాయ్ బాయ్ చెబుతూ కొత్త కలలకు శ్రీకారం చుడుతూ మీరు కనే ప్రతి కల నిజం అవ్వాలని కోరుకుంటూ మీ ప్రియమైన…..

    రంగురంగుల రత్నాలు, టపటప టపాసులు, తియ్య తియ్యని స్వీట్లు, ముద్దు ముద్దు విషెస్ లతో మీ ఈ సంవత్సరం కాంతుల మయం అవుతూ మీరు ఆనందంతో వెలగాలి.

    కన్నవారికి దూరంగా, కానీ వారికి దగ్గరగా ఉంటూ, అయినా వాటిని దూరం చేసుకుంటూ డబ్బు అనే అవసరం కోసం విదేశాలకు వెళ్లి ఎన్నో కష్టాలు పడుతున్న మీకు ఈ నూతన సంవత్సరం అన్ని సంతోషాలను పంచాలని కోరుకుంటూ happy new year.

    కష్టాలు వచ్చినా, కన్నీళ్లు ఎదురైనా అన్నింటిని ఎదుర్కొంటూ వాటికి ఎదురు ఈగుతూ మీ జీవితాన్ని అందంగా మార్చుకునే ధైర్యం మీకు ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ మీ ప్రియమైన…

    ఏదో సాధించాలని జీవితాన్ని కొత్తగా ప్రారంభించి, ఎటు సాగలేని దారులతో గందరగోళంలోకి వెళ్లి, అర్థం కాని జీవితం తో సతమతం అవుతున్న మీకు ఈ సంవత్సరం కొత్త దారులను చూపిస్తుందని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ప్రేమ, సాహసం, మంచితనం, కోపం, నిరాశ, నిస్సాహాయత, అనుమానం, అనుబంధం వంటి ఎన్నో సంఘర్షణలతో సాగిన మీ జీవితానికి సలాం కొడుతూ ఇక నుంచి ఎలాంటి ఆటంకులు రాకుండా ఈ సంవత్సరం నుంచి మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ ప్రియమైన…..

    మీ హృదయంలో నిండిన కోరికలు నెరవేరుతూ.. మీరు కోరుకునే వారు మీతో ఉంటూ.. మీ ప్రియమైన వారితో జీవితం సాగిస్తూ.. సంతోషంగా మీరు సాగాలని కోరుకుంటూ మీ ఫ్రెండ్…

    ఈ నూతన సంవత్సరం మీ కలలను తీసుకొని వచ్చి గడ్డు రోజులను ఆ 2024కు తీసుకొని వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఫ్రెండ్..

    ఈ 2025లో మీకు అంతులేని ఆనందం రావాలని, మీరు అనుకున్న విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ఈ నూతన సంవత్సరం మీకు, మీ ప్రియమైన వారికి సంతోషం, ఆరోగ్యం, శ్రేయస్సును అందించాలి. happy new year

    ఎన్నో ఒడిదుడుకులు, కొన్ని మాత్రమే సంతోషాలు, ఎక్కడ లేని కష్టాలు, ఆదరించే మనుషులు లేని నీ ప్రపంచంలో నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? ఇక నుంచి ఈ కొత్త సంవత్సరం నీ జీవితాన్ని మార్చి నీ చుట్టూ నలుగురు మంచి వారిని ఉండేలా చూడాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.