IPS Sandeep Chakravarthy: అప్పట్లో గాల్వాన్ లోయలో చైనా సైనికులకు, మన సైనికులకు తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో చైనా సైనికులకు భారత సైనికులు చుక్కలు చూపించారు. ఊర కొట్టుడు కొట్టారు. మనవాళ్లు కొట్టిన దెబ్బలకు చైనా సైనికులు బతుకు జీవుడా అంటూ పారిపోయారు. అయితే ఇందులో కొంతమంది చైనా సైనికులు దొంగ దెబ్బ కొట్టారు. అలా వారు కొట్టిన దొంగ దెబ్బ వల్ల తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్నల్ సంతోష్ కుమార్ వీరమరణం పొందాడు. అతడు చైనా సైనికులతో ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడాడు. అతడి తెగువ వల్ల చైనా సైనికులు పారిపోయారు. చివరికి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అతడు చైనా సైనికులతో పోరాడాడు. ఆ పోరాటంలో వీరమరణం పొందాడు. కల్నల్ సంతోష్ కుమార్ త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేం. అతడు చూపించిన తెగువ ను ఇండియన్ ఆర్మీ లో కథలు కథలుగా చెప్పుకుంటారు.
ఇండియన్ ఆర్మీ లో తెలుగు అధికారులు చాలా మంది పని చేస్తున్నారు. వారంతా కూడా వివిధ హోదాలలో ఉన్నారు. దేశ సంరక్షణ కోసం.. దేశ భద్రత కోసం వారు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టారు. తాజాగా ఒక అధికారి ఏకంగా దేశాన్ని ఉగ్రవాదుల బారి నుంచి కాపాడారు. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు. దేశంలో దాడులు జరగకుండా నిరోధించారు. ఆ తెలుగు అధికారి చూపించిన తెగువ వల్ల ఉగ్రవాదుల ప్రణాళిక ఆగిపోయింది. అంతేకాదు దొరికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా చెందిన సందీప్ అనే వ్యక్తి ఐపీఎస్ అధికారి. ఈయన 2014 బ్యాచ్ కు చెందినవారు. జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ పన్నిన కుట్రను సందీప్ చక్రవర్తి భగ్నం చేశారు. చాలాకాలంగా ఆయన కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాద నిరోధ ఆపరేషన్లు చేయడంలో ఆయన దిట్ట. సమర్థవంతంగా విధులు నిర్వహించి ఏకంగా ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడల్స్ సాధించారు. గత నెలలో పలుచోట్ల జేషే పోస్టర్లను చూశారు.. ఆయనకు ఎందుకో అనుమానం వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించారు. పాత కేసులలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఆ పోస్టర్లు అంటించినట్టు అనుమానం వ్యక్తం చేశారు. వారందరినీ కూడా ఆయన గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని చాలా రోజులపాటు విచారించారు. ఆ తర్వాత వైట్ కాలర్ టెర్రరిజం బయటపడింది.
వైట్ కాలర్ టెర్రరిజం గురించి పోలీసులు సోదాలు చేస్తుంటే.. జమ్ము కాశ్మీర్ లో మొదలైన వీరి మాడ్యూల్ హర్యానా దాకా చేరుకుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఫరిదాబాద్ ప్రాంతంలో వీరు భారీ ఎత్తున దాచిన పేలుడు సామాగ్రి బయటపడింది. దాదాపు పోలీసుల అదుపులో ప్రస్తుతం 8 మంది దాకా ఉగ్రవాదులు ఉన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉండడం విశేషం. ఇంతటి ఉగ్రవాదుల కుట్రను చేదించడంలో సందీప్ చక్రవర్తి కీలకంగా వ్యవహరించారు. ఆయన చూపించిన తెగువ వల్ల దేశం ఉగ్ర కుట్ర నుంచి బయటపడింది.