PM Modi Visits LNJP Hospital: ఇజ్రాయిల్ ఎంతో దుర్భేద్యంగా ఐరన్ డోమ్ వ్యవస్థను నిర్మించుకుంది. అటువంటి వ్యవస్థ పై హమాస్ అనే ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడి వల్ల ఇజ్రాయిల్ భారీగా నష్టపోయింది. ఈ పరిణామం తర్వాత ఇజ్రాయిల్ అధిపతి నేతాన్యాహు తీవ్రంగా స్పందించారు. మరో మాటకు తావు లేకుండా హమాస్ ఉగ్రవాదులపై యుద్ధం ప్రకటించారు. వారిపై విపరీతంగా దాడులు చేస్తూ కోలుకోకుండా చేశారు. తమ దేశం పై దాడి చేస్తే ఎంతటి వారికైనా సరే ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే..ఒక దేశం పై దాడి జరిగితే పాలకుడు ఎలా స్పందించాలో చెప్పడానికే ఇదంతా..
మనదేశంలో ఇదే తరహా సంఘటన ఇటీవల ఢిల్లీలో చోటుచేసుకుంది. అంతకు ముందు జమ్మూ కాశ్మీర్లో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు చేసిన దారుణాల వల్ల మన దేశం తీవ్రంగానే నష్టపోయింది. ఇప్పటికీ నష్టపోతూనే ఉంది. ఉగ్రవాదుల మూలలను నాశనం చేసే పని మన ఆర్మీ చేసినప్పటికీ.. అది లోతుల్లోకి వెళ్లలేదని ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఆపరేషన్ సిందూర్ కనుక మధ్యలో ఆపివేయకపోయి ఉంటే పాకిస్తాన్ పరిస్థితి మరో విధంగా ఉండేది. భారత దేశం ఎందుకు దానిని ఆపేసింది? దానిని ఆపడం వల్ల దేశం ఇటువంటి ప్రయోజనాలు పొందింది? దీని వెనుక ఎవరి ఒత్తిడి ఉంది? అనే విషయాలపై ఇప్పటికి క్లారిటీ లేదు. పైగా ఉగ్రవాదులు వైట్ కాలర్ రూపంలో మన దేశం మీద దాడికి దిగడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సరిగ్గా సోమవారం నాడు ఢిల్లీలో జరిగిన కారు పేలుడులో 12 మంది చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన తర్వాత భూటాన్ పర్యటనకు వెళ్ళిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి నుంచి ఉగ్రవాదులకు హెచ్చరికలు పంపారు. ఆపరేషన్ సిందూర్ కు ముందు ఎలాగైతే ఉగ్రవాదులకు హెచ్చరికలు చేశారో.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో హెచ్చరికలు చేశారు. కానీ ఇంత వరకు ఆపరేషన్ సిందూర్ 2.0 మొదలు కాలేదు. పైగా భూటాన్ పర్యటన నుంచి స్వదేశం వచ్చిన నరేంద్ర మోడీ.. కారు పేలుడు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వాస్తవానికి మోడీ ముఖంలో కూడా ఎటువంటి తీవ్ర ఛాయలు కనిపించడం లేదు. ప్రతీకారం ఆనవాళ్లు దర్శనమివ్వడం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉగ్రవాదులను ఈ పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని.. అవసరమైతే వారి మూలాలను తుద ముట్టించాలని.. మరోసారి భారత్ అంటేనే ఒళ్ళు జలదిరించేలా చేయాలని జాతీయ వాదులు కోరుతున్నారు.
ఈసారి ఆపరేషన్ సిందూర్ 2.0 కనక మొదలు పెడితే పాకిస్తాన్ అనే దేశాన్ని ఈ ప్రపంచ పటంలో లేకుండా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు..”ఉగ్రవాదం వల్ల మన దేశం దశాబ్దలకాలంగా ఇబ్బంది పడుతూనే ఉంది. ఆర్థికంగా.. సామాజికంగా.. దేశ ప్రజల ప్రాణాలపరంగా నష్టపోతూనే ఉంది.. ఈ నష్టం ఇంకా ఎన్ని సంవత్సరాలు.. ఎందుకు భరించాలి.. ఇన్ని ఇబ్బందులకు కారణమైన వారిని అంతం చేయాల్సిందేనని” జాతీయవాదులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
Went to LNJP Hospital and met those injured during the blast in Delhi. Praying for everyone’s quick recovery.
Those behind the conspiracy will be brought to justice! pic.twitter.com/HfgKs8yeVp
— Narendra Modi (@narendramodi) November 12, 2025