Groups Interviews: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇందుకు గాను కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సంకల్పించింది. ఇందులో భాగంగానే నియామకానికి కసరత్తు ప్రారంభించింది. మంగళవారం సమావేశమైన మంత్రివర్గం ఉద్యోగాల విషయంలో పలు నిర్ణయాలు తీసుకుంది. నిరుద్యోగుల ఆశలు ఫలించేలా ముందకు వెళ్తోంది. ఇన్నాళ్లు ఉద్యోగాల కోసం ఉన్న పద్ధతులను మార్చేందుకు ఉద్దేశించింది.
తెలంగాణలో గ్రూప్ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగాల కల్పనకు నిర్ణయం తీసుకుంది. దీంతో మంత్రివర్గ భేటీలో గ్రూప్ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలు అవసరం లేదని తేల్చింది. దీంతో ఇన్నాళ్లు ఇంటర్వ్యూ పద్ధతిలోనే నియామకాలు చేపట్టేవారు. దీంతో ఉద్యోగార్థులకు సమస్యలు వచ్చేవి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం రద్దుకు ఆమోదం తెలిపింది.
Also Read: Pawan Kalyan : ఓదారుస్తూ.. ఆర్థిక భరోసానిస్తూ ధైర్యం నింపిన పవన్ కళ్యాణ్
పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు కూడా మంత్రివర్గం అనుకూల నిర్ణయమే తీసుకుంది. అభ్యర్థులకు మూడేళ్ల వయోపరిమితి పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ప్రయోజనం చేకూరనుంది. మెడికల్ కళాశాలల్లో ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ పరిమితి 65 ఏళ్లకు పెంచింది. దీంతో రాష్ర్ట కేబినెట్ నిర్ణయాలపై అందరిలో హర్షం వ్యక్తమవుతోంది.
విశ్వవిద్యాలయాల సిబ్బంది నియామకాల కోసం కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా చేపట్టాలని సూచించింది. 3500 బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని నిర్ణయిచింది. రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాల అమలుకు శ్రీకారం చుట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై వేగవంతమైన చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగానికి సూచనలు చేసింది. రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పింది. ఇక ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం అవుతుందనే ఆశ నిరుద్యోగుల్లో వస్తోంది.
Also Read:CM KCR: కేసీఆర్ అబద్దాల్లో గిన్నిస్ రికార్డే బద్దలు కొడతారా?