Hyderabad Tree City: హైదరాబాద్ నగరం మరో అరుదైన గుర్తింపు సాధించింది. భాగ్యనగరం రికార్డులకు కొదవే లేదు. ప్రపంచ గుర్తింపును సొంతం చేసకుంటోంది. ప్రపంచంలోనే రెండోసారి ట్రీ సిటీగా తన సత్తా చాటింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్, ఆర్సర్ డే ఫౌండేషన్ సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా పచ్చదనం పెంపొందిస్తున్న నగరాల జాబితాలో చోటు దక్కించుకోవడం తెలిసిందే. దీంతో హైదరాబాద్ కు ట్రీ సిటీగా ఎంపిక కావడం గర్వకారణమే.
తెలంగాణ ప్రభుత్వం పచ్చదనానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో మొక్కల పెంపకంపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగానే గ్రీన్ చాలెంజ్ నిర్వహిస్తూ అందరు మొక్కలు నాటి సంరక్షించేలా చర్యలు తీసుకుంటోంది. 2020లోనూ హైదరాబాద్ ట్రీ సిటీగా గుర్తింపు సాధించడం గమనార్హం. గత రెండేళ్లలో దాదాపు 3.50 కోట్ల మొక్కలు నాటి తన గుర్తింపుకు భంగం కలగకుండా ప్రణాళిక ప్రకారంగా చర్యలు చేపట్టింది.
Also Read: Jagan New Cabinet: ఫస్ట్ టైం బతిమిలాడుతున్న జగన్.. ఎందుకో తెలుసా?
ఎంపీ సంతోష్ కుమార్ మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారు. దీంతో నగరం మొత్తం మొక్కలమయంగా మారిపోయింది. దీంతోనే రికార్డులు సాధిస్తోంది. ట్రీ సిటీగా రెండుసార్లు రికార్డు సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. పచ్చదనం కోసం అందరు ఉద్యమించాల్సిన అవసరాన్ని చెబుతోంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు కూడా ఇదే తోవలో ప్రయాణించి సమాజానికి మేలు చేకూర్చే మొక్కల పెంపకంపై దృష్టి సారించాలి.
భవిష్యత్ లో కూడా నగరం పచ్చదనంగా ఉండేందుకు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మొక్కలను విరివిగా పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సిద్ధమవుతున్నారు. నగరానికి అందిన అరుదైన గుర్తింపుతో అందరిలో ఉత్సాహం రెట్టింపవుతోంది. నగరాన్ని నందనవనంగా మార్చేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఇందులో భాగంగానే మొక్కల పెంపకం పెద్ద ఉద్యమంలా చేయాలని భావిస్తున్నారు.
Also Read:Groups Interviews: నిరుద్యోగులకు ఇంటర్వ్యూల గోల్ మాల్ ను తీసేసిన కేసీఆర్