Israel: అది ఒక చిన్న దేశం. జనాభా కోటికి లోపే. కానీ ప్రపంచ వ్యవసాయానికి పాఠాలు నేర్పిన ఘనత దాని సొంతం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీటీ పత్తి, సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం, గ్రీన్ హౌస్, పాలీ హౌస్ వంటి అధునాతన వ్యవసాయ విధానాలు మొత్తం ఇజ్రాయిల్ ద్వారా దిగుమతి అయినవే. అక్కడిదాకా ఎందుకు ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లను ఉత్పత్తి చేసే దేశంగా కూడా ఇజ్రాయిల్ రికార్డు సృష్టించింది.. ఎడారి దేశమైనప్పటికీ ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ అత్యధిక దిగుబడి ఇచ్చే పంటలను సాగు చేస్తుంది. పత్తి, కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలు.. ఇలా ఏ విభాగం లో చూసుకున్నా ఇజ్రాయిల్ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. అటువంటి ఇజ్రాయిల్.. యూదుల దేశంగా ఎలా ఏర్పడింది? అతి తక్కువ జనాభా ఉన్న ఆ దేశం శత్రు మూకల నుంచి తనను తను ఎలా కాపాడుకుంటున్నది?
ఇజ్రాయిల్_ తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే వేలాదిమంది మరణించారు.. ఆకస్మిక దాడి నేపథ్యంలో ఇజ్రాయిల్ ఈసారి హమాస్ ఉనికి లేకుండా నాశనం చేస్తానని ప్రకటించింది. అదే సమయంలో హమాస్ కూడా అలుపెరుగని దాడి కొనసాగిస్తున్నది. అయితే ఇజ్రాయిల్ పై హమాస్ దాడి చేయడం ఇది తొలిసారి కాదు. అంతకు ముందు కూడా హమాస్ ఇటువంటి దాడులకు పాల్పడింది. ఈ దాడులకు ఇజ్రాయిల్ కూడా తగిన సమాధానం ఇస్తూనే ఉంది.
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యూదులు నివసించే ఏకైక దేశం ఇజ్రాయిల్. 1948లో యూదులు తమకంటూ ప్రత్యేకంగా ఇజ్రాయిల్ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ముస్లిం పొరుగు దేశాలు మొత్తం ఇజ్రాయిల్ కు శత్రువులుగా మారాయి. ఇజ్రాయిల్ పలుమార్లు దాడులు కూడా గురైంది. ఈ చిన్న దేశం తన బలాన్ని అంతకంతకు పెంచుకుంటూ వస్తోంది. దీంతో శత్రు దేశాలు ఇజ్రాయిల్ ను దెబ్బతీయలేకపోతున్నాయి. ఈ దేశంలో దాదాపు 70 లక్షల మంది యూదులు ఉన్నారు. ఇక్కడి మొత్తం జనాభాలో దాదాపు 74%. ఇది ప్రపంచంలోని మొత్తం యూదుల జనాభా విషయానికి వస్తే దాదాపు ఒక కోటి 74 లక్షలు. అంటే ప్రపంచంలోని యూదు జనాభాలో 43 శాతం మంది ఒక్క ఇజ్రాయిల్ దేశంలోనే నివసిస్తున్నారు. ఇజ్రాయిల్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని ఏ దేశాలలో యూదులు నివసిస్తున్నారని విషయానికి వస్తే అమెరికాతోపాటు కెనడాలో అత్యధిక సంఖ్యలో యూదులు జీవనం కొనసాగిస్తున్నారు. కెనడాలో అత్యధిక సంఖ్యలో యూదులు నివసిస్తున్నారు. ఈ రెండు దేశాల్లో దాదాపు 43% యూదులు నివసిస్తున్నారు. మిగిలిన 24% యూదులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడ్డారు. స్వతహాగా పోరాడే నైపుణ్యం కలిగిన యూదులు.. ప్రస్తుతం హమాస్ తో జరుగుతున్న పోరాటంలో ముందుండి నడుస్తున్నారు. ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు సైన్యం లోకి వెళ్తున్నారు. దేశం కోసం విజయమో, వీర స్వర్గమో అనే స్థాయిలో పోరాడుతున్నారు.