Nani Dasara Movie: నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడు పోయాయనీ, ఇంకా చెప్పాలంటే నాని కెరీర్‌లోనే ఇది పెద్ద మొత్తం అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇంతకీ థియేట్రికల్ హక్కులు ఎంత పలికాయో తెలుసా ? 28 కోట్లు.

ఈ సినిమాలో నాని మాస్ లుక్ ఆకట్టుకుంటుండగా.. శ్రీకాంత్ ఓదెల అద్భుతంగా డైరెక్ట్ చేస్తున్నాడట. అందుకే.. ఈ సినిమాకి బిజినెస్ బాగా జరుగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుందట. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ఈ చిత్రం దాదాపుగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అందుకే నాని ఫోకస్ అంతా ప్రస్తుతం దసరా పైనే ఉంది. ఈ సినిమా సింగరేణి బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. అయితే, ప్రస్తుతం ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని పాత్రకు ఒక ఫ్రెండ్ పాత్ర ఉంది. ఈ పాత్ర చాలా కీలకం. ఐతే, ఆ పాత్రలో ఒక పేరున్న హీరో నటించాడు.
ఇది సినిమాలోనే చాలా సర్ ప్రైజ్ ప్యాకేజీగా ప్లాన్ చేశారని టాక్ నడుస్తోంది. మరి నాని స్నేహితుడిగా ఏ స్టార్ హీరో నటించాడో చూడాలి. కాకపోతే, ఆ స్టార్ హీరోది జస్ట్ 2 మినిట్స్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ సినిమా పై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. ఇక నాని వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.

ఏడాదికి ఒక్కో స్టార్ హీరో నుంచి వచ్చేది ఒక్క సినిమా మాత్రమే. ఇక కొంతమంది స్టార్లు అయితే రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. అయితే ఒక్క న్యాచురల్ స్టార్ నాని మాత్రం ఒక సినిమా ప్రొడక్షన్ లో ఉండగానే మరో చిత్రాన్ని లాంచ్ చేస్తూ వెళ్తున్నాడు. కాబట్టి, నానికి ప్లాప్ అండ్ హిట్ లకు సంబంధించి పెద్దగా ఒత్తిడి లేదు.