Homeజాతీయ వార్తలుHumsafar Policy: హమ్‌సఫర్‌ పాలసీ’ : హైవేలపై సుఖమైన ప్రయాణం.. కొత్త స్కీం ప్రారంభించిన కేంద్రం..

Humsafar Policy: హమ్‌సఫర్‌ పాలసీ’ : హైవేలపై సుఖమైన ప్రయాణం.. కొత్త స్కీం ప్రారంభించిన కేంద్రం..

Humsafar Policy: దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరు కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది హమ్‌సఫర్‌ పేరుతో కొత విధానాన్ని కేంద్ర రోడ్లు–రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించించారు. కొత్త వ్యాపార అవకాశౠలతో స్థానిక ఆర్థిక వ్యవస్థలను పెంచడం ఈ పాలసీ లక్ష్యం. జాతీయ రహదారుల వెంట మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించారు. ఈ విధానం అత్యవసర సౌకర్యాలను అందించడం, ప్రాయాణ అనుభవాన్ని మెరుగు పచ్చడంపై దృష్టిసారిస్తారు. హైవేలు మంరిత యూజర్‌ ఫ్రెండ్లీగా అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తారు.

హమ్‌సఫర్‌ అంటే..
హమ్‌సఫర్‌ పాలసీ అనేది అనేక రకాల అవసరమైన సేవలు, సౌకర్యాలను అందిస్తుంది. తద్వారా భారత హైవే నెట్‌వర్క్‌ మారుతుంది. అన్ని ప్రాంతాల ప్రయాణికుల కనీస అవసరాలు తీర్చడానికి ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

పాలసీ ముఖ్య లక్షణాలు..
హమ్‌సఫర్‌ పాలసీ కింద, జాతీయ రహదారులపై అనేక ముఖ్యమైన సౌకర్యాలు ప్రవేశపెట్టబడతాయి.ప్రయాణీకులకు సరైన పారిశుధ్యం అందుబాటులో ఉండేలా పరిశుభ్రమైన టాయిలెట్లను నిర్ణీత వ్యవధిలో ఏర్పాటు చేస్తారు. చిన్న పిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు పిల్లల సంరక్షణ కోసం ప్రత్యేక గదులు, మారే టేబుల్‌లు, ఇతర నిత్యావసరాలతో కూడిన గదులు అందుబాటులో ఉంచుతారు. దివ్యాంగులైన ప్రయాణికుల కోసం వీల్‌చైర్‌ సదుపాయాలు అందుబాటులోకి తెస్తారు. ఎలక్ట్రిక్‌ వాహనాల పెరుగుదల నేపథ్యంలో పర్యావరణ అనుకూల రవాణా వినియగాన్ని ప్రోత్సహించడానికి హైవే నెట్‌వర్క్‌లోని వ్యూహాత్మక పాయింట్ల వద్ద ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఇంధన స్టేషన్లు, విశ్రాంతి స్టాప్‌ల వద్ద తగినంత పార్కింగ్‌ ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు పెట్రోల్, డీజిల్, ఇతర అవసరమైన సేవలను సులభంగా పొందే వీలు ఉంటుంది.

ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్‌లు..
హమ్‌సఫర్‌ పాలసీలో భాగంగా హైవేల వెంట రెగ్యులర్‌ వ్యవధిలో రెస్టారెంట్లు ఫుడ్‌ కోర్ట్‌లను ఏర్పాటు చేయడం, ప్రయాణికులకు వారి ప్రయాణాల సమయంలో నాణ్యమైన ఆహారం, రిఫ్రెష్‌మెంట్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ట్రక్‌ డ్రైవర్లు, ప్రయాణికులు, సుదూర ప్రయాణాల సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి వసతి కల్పించేందుకు ఇంధన స్టేషన్లలో డార్మెటరీ హాల్‌లు ఏర్పాటు చేస్తారు.

వ్యాపార అవకాశాలు..
హమ్‌సఫర్‌ పాలసీతో ప్రయాణికులకు సౌకర్యం కల్పించడంతోపాటు ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం అందించడం, వ్యాపార అవకాశాలు సృష్టించడం కూడా ఇందులో భాగమే. పెట్రోల్‌ పంపులు, రెస్టారెంట్లు మరియు విశ్రాంతి స్టాప్‌లు ఉపాధిని సృష్టిస్తాయి. సుదూర ట్రక్‌ డ్రైవర్లు మరియు రోజువారీ ప్రయాణికులకు సేవలను అందిస్తాయి.

భద్రత, సౌలభ్యతపై దృష్టి..
హైవే వినియోగదారుల భద్రతను మెరుగుపరచడం హమ్‌సఫర్‌ పాలసీ యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటి. శుభ్రమైన మరుగుదొడ్లు, పార్కింగ్‌ స్థలాలు మరియు విశ్రాంతి స్థలాలను అందించడం ద్వారా, డ్రైవర్లు అవసరమైన విరామాలు తీసుకోవచ్చని, అలసటతో ప్రమాదాలను తగ్గించవచ్చని అంటున్నారు.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరచడం
హమ్‌సఫర్‌ విధానాన్ని అమలు చేయడం ద్వారా, రోడ్డు రవాణా – రహదారుల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను ఆధునీకరించడం, అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. హైవేల వెంబడి ఇటువంటి సౌకర్యాల పరిచయం కుటుంబాలు, వ్యక్తిగత ప్రయాణికులు, సుదూర డ్రైవర్లకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. దేశవ్యాప్తంగా మరింత సమర్థవంతమైన, ప్రయాణీకులకు అనుకూలమైన నెట్‌వర్క్‌కు దోహదపడుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular