Uber Pet
Uber Pet : కరోనా సమయంలో క్వారంటైన్ కారణంగా చాలా మందికి ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసింది. కోవిడ్ చాలా మంది జీవితాల్లో కీలక మార్పులు తీసుకువచ్చింది. వ్యాధులకు, చావుకు దనిక, పేద తేడా లేదని గ్రహించారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఉండడానికి భయపడుతున్నారు. దీంతో చాలా మంది కోవిడ్ తర్వాత పెట్స్‌ను పెంచుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. వాటితో మానసిక ప్రశాంతత పొందతున్నారు. అయితే ఎటైనా ఊళ్లకు వెళ్లినప్పుడు పెట్స్‌ను తీసుకళ్లడం చాలా కష్టంగా ఉంటుంది. వామనాల్లోకి పెట్స్‌ను అనుమతించకపోవడంతో బంధువుల ఇళ్లలోనో.. పొరుగు ఇళ్లలోనో ఉంచి వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి సమస్య పరిష్కారానికి భారతదేశంలోని ప్రముఖ రైడ్‌షేరింగ్ యాప్‌లలో ఒకటైన ఉబెర్ ముందుకు వచ్చింది. బెంగళూరులో ఉబెర్ పెట్ ఫ్రెండ్లీ రైడ్‌ను ప్రారంభించింది. ఈ కొత్త రిజర్వ్–ఓన్లీ సర్వీస్‌తో, పెంపుడు జంతువుల యజమానులు ఇప్పుడు తమ పెట్స్(కుక్కలతో) ఒత్తిడి–రహిత ప్రయాణానికి అనుమతి ఇస్తోంది.
బెంగళూర్‌లో ప్రారంభం..
ఉబెర్ పెట్ రైడర్‌లు తమ పెంపుడు జంతువుతో–కుక్క లేదా పిల్లితో రైడ్‌ను బుక్ చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. తమకు, వారి పెంపుడు జంతువులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫీచర్ రైడర్‌కు సౌకర్యాన్ని అందించడమే కాకుండా ప్రయాణ సమయంలో వారి పెంపుడు జంతువుకు స్వాగతం పలుకుతుందని తెలుసుకుని మనశ్శాంతిని కూడా అందిస్తుంది. ఉబెర్ పెట్ ఎంపికను ఎంచుకోవడం ద్వారా, పెంపుడు జంతువు ప్రయాణిస్తుందని డ్రైవర్‌లకు తెలియజేయబడుతుంది, తద్వారా రైడర్ మరియు డ్రైవర్ ఇద్దరికీ అనుభవాన్ని సున్నితంగా ఆనందించేలా చేస్తుంది.
పెట్స్ ఎంతో విలువైనవి..
పెట్ ఫ్రెండ్లీ రైడ్ ప్రారంభం సందర్భంగా దక్షిణాసియా రైడర్ వెర్టికల్స్ హెడ్ స్వేతా మంత్రి మాట్లాడారు. పెంపుడు జంతువులు వారి కుటుంబానికి ఎంతో విలువైనవన్నారు. తమ విహారయాత్రలలో వాటిని చేర్చుకోవడం చాలా అవసరమని పేర్కొన్నారు. పెంపుడు జంతువుల యజమానులు, వారి సహచరులకు ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి, సౌకర్యవంతంగా చేయడానికి ఉబర్ పెట్ తమ ప్రయత్నం అని తెలిపింది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Uber launches uber pet in bengaluru allows riders to bring pets
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com