https://oktelugu.com/

DY Chandrachud: కొడుకు సీజేఐ.. తండ్రికే న్యాయ సూత్రాలు చెప్పారు.. న్యాయాన్ని పాటించి చూపిన చంద్ర చూడ్

తమ్ముడు తన వాడైనా ధర్మం సరిగ్గా చెప్పాలి.. అనే నానుడి ఉంది తెలుసు కదా.. దానిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (నేటితో పదవి విరమణ చేశారు) మార్చి చూపించారు. న్యాయం చెప్పే విషయంలో కన్నతండ్రిని కూడా ఆయన పక్కన పెట్టారు. ఆయనకే న్యాయ సూత్రాలు వల్లించి చూపారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 8, 2024 / 09:28 PM IST

    DY Chandrachud

    Follow us on

    DY Chandrachud: దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా ధనంజయ యశ్వంత్ చంద్ర చూడ్ .. శుక్రవారం తో తన చివరి పని దినాన్ని ముగించుకున్నారు. ఆదివారం ఆయన పదవీ విరమణ చేస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ ఎన్నో కేసుల్లో సంచలన తీర్పులు చెప్పారు. దేశ ప్రజలకు న్యాయవ్యవస్థ మీద నమ్మకం కలిగించేలా చేశారు. 2016లో చంద్ర చూడ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి అనేక అద్భుతమైన తీర్పులు ఆయన చెప్పారు. అంతేకాదు మన దేశ చరిత్రలో ఎక్కువ కాలం సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన యశ్వంత్ విష్ణు చంద్ర చూడ్ తనయుడే డివై చంద్ర చూడ్. ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా పేరుపొందారు. అంతేకాదు ప్రధాన న్యాయమూర్తిగా తన తండ్రి ఇచ్చిన తీర్పులను పున: సమీక్షించారు. కొన్ని కేసులలో న్యాయ సూక్తులను కూడా ఆయన వల్లించారు..

    సంచలన తీర్పులు ఇవే..

    2017-18 కాలంలో ఆడల్టరి చట్టానికి సంబంధించి ఆయన ఇచ్చిన తీర్పు సంచలనం కలిగించింది. శివకాంత్ శుక్లా వర్సెస్ ఏటీఎం జబల్ పూర్ కేసులో యశ్వంత్ విష్ణు చంద్ర చూడ్ ఇచ్చిన తీర్పును డివై చంద్ర చూడ్ సరికాదని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆ కేసులో తనదైన తీర్పు ఇచ్చారు. ఈ కేసు దాదాపు 1985 కాలంనాటిది. అప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా యశ్వంత్ విష్ణు చంద్ర చూడ్ ఉన్నారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు ఎదుటకు సామిత్ర విష్ణు అనే కేసు వచ్చింది.. ఆ కేసు విచారణ అనంతరం అందులో ఐపిసి సెక్షన్ 497 ను అమలు చేయడాన్ని యశ్వంత్ విష్ణు చంద్ర చూడ్ సమర్థించారు. “ఒక సంబంధం ఏర్పడేందుకు అనేక ప్రలోభాలు ఎదురవుతాయి. వాటికి ముందుగా గురయ్యేది పురుషులు మాత్రమే. స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో వాటికి గురికారని” యశ్వంత్ విష్ణు చంద్ర చూడ్ ఇచ్చిన తీర్పులో స్పష్టం చేశారు. అయితే దీనిని 2018లో జస్టిస్ డివై చంద్ర చూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తప్పు పట్టింది ఆ తర్వాత దానిని రద్దు చేసింది..”పితృ స్వామ్య నియమాల్లో వ్యభిచారం అనేది ఒక చట్టం లాగా ఉంది. అది సరైనది కాదు లైంగిక ప్రతిపత్తి అనేది పురుషులకు, స్త్రీలకు సమానంగా ఉంటుంది. దీనిని లింగం ఆధారంగా చూడొద్దు. ఇలా చూస్తే లింగబేదాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. ముందుగా వ్యక్తుల స్వేచ్ఛను హరించకూడదు. వ్యక్తుల అంతర్గత విషయాలలో కలగజేసుకోకూడదు. అంతర్గత విషయాలలో తొంగి తొంగి చూస్తే దానిని నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని” డి వై చంద్ర చూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం అప్పట్లో సంచలన తీర్పు వెలువరించింది. ఇవే కాక శివకాంత్ శుక్లా వర్సెస్ ఏడీఎం జబల్ పూర్ కేసులోనూ డీవై చంద్రచూడ్ తన మార్క్ తీర్పును ప్రకటించారు..” వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ప్రజల తమ జీవితాన్ని ప్రభుత్వానికి అప్పగించడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఇలాంటి విషయాల్లో వ్యక్తుల ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇవ్వడమే సముచితమని” డీవై చంద్ర చూడ్ వ్యాఖ్యానించారు.