https://oktelugu.com/

Dinner Facts: రాత్రిపూట ఈ పదార్థాలు తిన్నారో.. ఇక అంతే సంగతులు!

రాత్రిపూట ఎట్టి పరిస్థితులలో కూడా కెఫెన్ ఉండే పదార్థాలను అసలు తీసుకోకూడదు. రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. దీంతో నిద్రలేమి సమస్యలు, అలసట, నీరసం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 8, 2024 / 08:25 PM IST

    Himachal Pradesh

    Follow us on

    Dinner Facts: సాధారణంగా ఉదయం పూట ఆహారం ఎక్కువగా తినాలి. మధ్యాహ్నం, రాత్రి ఆహారం చాలా తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి. నేను తీసుకునే పద్ధతిలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. కొన్ని పదార్థాలు ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాగే కొన్ని పదార్థాలు ఉదయం తీసుకోకపోవడం ఆరోగ్యానికి మంచిది. అయితే కొందరికి తెలియక కొన్ని రకాల ఆహార పదార్థాలను రాత్రిపూట తీసుకుంటారు. దీనివల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా కొన్ని పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేసినవైనా.. వాటిని రాత్రిపూట తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు. కొందరికి తెలియక రాత్రిపూట కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు. వీటి వల్ల శరీరానికి నష్టాలు తప్ప లాభాలు ఉండవు. రాత్రిపూట తినకూడని కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట కొన్ని రకాల ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల అది నిద్రపోయి కూడా ప్రభావం చూపుతుంది. ఇంతకీ రాత్రిపూట తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకోవాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    రాత్రిపూట ఎట్టి పరిస్థితులలో కూడా కెఫెన్ ఉండే పదార్థాలను అసలు తీసుకోకూడదు. రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. దీంతో నిద్రలేమి సమస్యలు, అలసట, నీరసం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట సరిగ్గా నిద్ర లేకపోతే జీర్ణ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల జీర్ణ క్రియ దెబ్బతిని కడుపు, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే రాత్రి పూట స్వీట్లు, చాక్లెట్లు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే స్వీట్లలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో కూడా చాక్లెట్లు స్వీట్లు తినవద్దు. అలాగే రాత్రిపూట పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో ఉండే పదార్థాలు వల్ల తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. బాగా వేయించిన ఫుడ్, సిట్రిక్ ఆమ్లం వంటివి కూడా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటితోపాటు రాత్రి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే పదార్థాన్ని అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే వీటి వల్ల రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు. ఎక్కువసార్లు టాయిలెట్ కి వెళ్లవలసి వస్తుంది. కాబట్టి ఈ పదార్ధాలు రాత్రిపూట తీసుకోకపోవడం మంచిది. లేకపోతే మళ్లీ అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.