https://oktelugu.com/

Akira Nandan: పవన్ కళ్యాణ్ బాటలోనే నడుస్తున్న అకీరా నందన్…సినిమా ఎంట్రీ ఎప్పుడంటే..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా ఎక్కువైపోతుందనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ వారసత్వ పరంగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లే కావడం విశేషం. ఇక ఎంత వారసత్వం ఉన్నా కూడా టాలెంట్ లేకపోతే ఇండస్ట్రిలో ఎదగడం చాలా కష్టమని కొంతమంది హీరోల కెరియర్ ను గమనిస్తే మనకు ఈజీగా తెలిసిపోతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 8, 2024 / 09:30 PM IST

    Akira Nandan

    Follow us on

    Akira Nandan: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. చిరంజీవి తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈయన తనకంటూ ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేయడమే కాకుండా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను కూడా అందుకున్నాడు. ఆయన చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు తమదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఎవ్వరికి అందనంత ఎత్తులో ముందుకు దూసుకెళ్లాడు. ఇక ప్రస్తుతం ఆయనకి ఉన్న క్రేజ్ ఏ తెలుగు హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ఆయన పాలిటిక్స్ లో చాలా బిజీగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన సినిమా ఇండస్ట్రీ తో కూడా కనెక్షన్స్ తెంపేసుకోకుండా అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ప్రస్తుతం తన కొడుకు అయిన అఖీరానందన్ ను కూడా సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలనే ఉద్దేశ్యం తో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా అకిరానందన్ కు వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ లో శిక్షణ ఇప్పిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.

    ఇక ఇంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా ఆయన దగ్గరే శిక్షణ తీసుకొని స్టార్ హీరోగా ఎదిగిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ బాటలోనే అఖిరా నందన్ కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక తొందర్లోనే ఆయన సినీ రంగ ప్రవేశం కూడా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

    ఇక ఏది ఏమైనా కూడా ఆయన లాంటి హీరో ఇండస్ట్రీ కి వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా ను మ్యాచ్ చేస్తూ అతను కూడా స్టార్ హీరోగా ఎదుగుతాడంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ ఇంకా అఫీషియల్ గా ఈ విషయం మీద స్పందించలేదు కాబట్టి అఖీరా నందన్ సత్యానంద్ గారి దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడా లేదా అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రాలేకపోతుంది. ఇక మొత్తానికైతే మరో రెండు మూడు సంవత్సరాలలో అఖీరా నందన్ సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం ఇవ్వబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది…