Punjab CM Candidate: దేశంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో అలజడి రేగుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో పంజాబ్ లో సీఎం అభ్యర్థిని ప్రకటించి కాంగ్రెస్ ప్రచారం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. లూథియానాలో జరిగిన వర్చువల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని వర్చువల్ గా ప్రకటించింది. దీంతో సీఎం అభ్యర్థి చరణ్ జిత్ సింగ్ చన్నీని తమ సీఎం అభ్యర్థిగా అధినేత రాహుల్ గాంధీ ప్రకటించడంతో వేదిక మీదే కూర్చున్న చన్నీ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోతి సింగ్ సిద్దూ కాళ్లు తాకడం వివాదాస్పదమైంది.

కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థులను ప్రకటించడం కాస్త ఆలస్యంగానే చేస్తున్నా ఈ సారి మాత్రం కాస్త ముందుగానే వెల్లడించి ప్రత్యర్థులకు సవాలు విసురుతోంది. కానీ సీఎం అభ్యర్థి కాళ్ల మీద పడటంపైనే విమర్శలు వస్తున్నాయి. ఇదెక్కడి సంప్రదాయమని అందరు పెదవి విరుస్తున్నారు. సీఎం అభ్యర్థి విషయం అధిష్టానం చూసుకుంటుంది తప్ప ఇక్కడి వారికి ఎందుకు అంత ప్రాధాన్యం అనే వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read: టాలీవుడ్ మీద మళ్లీ దండయాత్ర చేయబోతున్న ఈడీ.. రేవంత్ రూపంలో కథ మొదటికి..!
ఈ క్రమంలో పంజాబ్ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే సీఎం మేనల్లుడుపై ఈడీ దాడులు కొనసాగగా అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు సైతం పంపించారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు జై కొడతారో నహి కొడతారో తెలియడం లేదు. కానీ రాష్ట్రంలో ఆప్ కే అధికారం దక్కుతుందని పలు సర్వేలు చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధిస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి.
కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు మామూలే. పంజాబ్ లో చరణ్ జిత్ సింగ్ చన్నీ గెలుపుకు ఎంతవరకు తోడ్పడతారో తెలియడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన శైలిలో ప్రచారం నిర్వహించేందుకు ముందుకు వెళ్తోంది. దీని కోసం ప్రచారంలో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.

పంజాబ్ లో నెలకొన్న పరిణామాల క్రమంలో ఆప్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉండనున్నాయని సర్వేలు చెబుతుండటంతో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం కోసం అన్ని ప్రయత్నాలు చేయనుందని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే. సీఎం చరణ్‌జిత్ చన్నీ విజయానికి పార్టీ కేడర్ పాటుపడుతుందో లేదో అనే అంశం ఆసక్తి కలిగిస్తోంది.
Also Read: కేసీఆర్ మీద కోర్టుకు వెళ్తున్న సంజయ్.. టీఆర్ ఎస్‌కు అస్త్రం రెడీగా ఉందిగా..!