Jana Sena: ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ సాధన కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగుల్లో విభేదాలు కల్పించి వారిని విడగొట్టి ప్రభుత్వం తన పంతం నెరవేర్చుకుంది. దీనిపై ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. తమకు తెలియకుండా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో కుమ్మక్కై ఉద్యమాన్ని పక్కదారి పట్టించారని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత ఉపాధ్యాయుల తరఫున గళం ఎత్తారు. ప్రభుత్వం చేసిన దాన్ని తప్పుబడుతున్నారు. ఉపాధ్యాయులను మోసం చేసి దొంగ దారిలో ఉద్యోగులను తమ దారికి తెచ్చుకున్న ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పీఆర్సీ ప్రకటన చేయకుండా ఉద్యోగులను వంచంచి సమ్మె విరమించేలా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఉపాధ్యాయులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు పీఆర్సీ విషయంలో ఎందుకు తలొగ్గారో తెలియడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం తన పంతం నెగ్గించుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఉద్యోగులు సమ్మె విరమిస్తున్నట్లు చేసిన ప్రకటనపై అందరిలో అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వమే బెదిరించి ఉద్యోగులతో ఈ విధంగా మాట్లాడించిందనే సంశయాలు సైతం వెలుగులోకి వస్తున్నాయి.
ఉద్యోగులు కోరిన ఫిట్ మెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం ఏ డిమాండ్లు ఓకే చేసిందో చెప్పడం లేదు. దీంతోనే ఉపాధ్యాయుల్లో పలు ప్రశ్నలు వస్తున్నాయి. ఉద్యోగులపై ఆధిపత్య ధోరణి ప్రదర్శించడానికే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తన పంతం నెరవేరే క్రమంలోనే ప్రభుత్వం ఉద్యోగులను పావులుగా వాడుకుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వ తీరుకు తగిన ప్రతిఫలం అనుభవిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలు తీర్చేందుకు సిద్ధంగా ఉందన్న వాదన తెరపైకి తేవడంతో ఉపాధ్యాయుల్లో ఊరట వస్తోంది. ప్రభుత్వంపై పోరాడేందుకు తాము సిద్ధమేనని ప్రకటిస్తున్నాయి. పవన్ కల్యాణ్ మద్దతుతో ఉపాధ్యాయులు మరోమారు పోరు బాట పట్టేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఇదే జరిగితే వైసీపీకి మరోమారు ఇబ్బందులు తప్పవనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.