Most Photographed Places in the World: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఏదైనా అందంగా కనిపిస్తే చాలు అందరూ క్లిక్ మనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోని వింతలు విశేషాలు.. అద్భుతాలు బయటపడుతున్నాయి. ప్రజలంతా తమకు అద్భుతంగా అనిపించిన చిత్రాలను తీసి ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయడంతో ఇప్పుడు ‘ట్రావెల్ ఫోటోగ్రఫీ’ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

ఈ ట్రావెల్ ఫొటోగ్రఫీ కారణంగా ఈ భూగ్రహం మీద దాదాపు ప్రతి ఒక్కరూ స్వంత వ్యక్తిగత ప్రయాణ ఫోటోగ్రాఫర్‌గా మారుతున్నారు. తాము వెళ్లిన ప్రతిచోట అందమైన ప్రాంతాలను ఫొటో తీసి షేర్ చేస్తున్నారు. ఆ అందాలు ప్రపంచానికి పరిచయం అవుతున్నాయి. అలా ప్రపంచంలోనే అత్యధికంగా ఫోటో తీసిన ప్రదేశాల గురించి మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యధికంగా ఇష్టపడ్డ ప్రాంతాలు, ఆ ఫొటోల గురించి కింద స్టోరీలో తెలుసుకుందాం.
ఒక్కో ప్రాంతం.. అక్కడి ప్రకృతి రమణీయత అనేది ప్రతి వీక్షకుడికి విభిన్న భావోద్వేగాలు.. భావాలను అందిస్తాయి. బహుశా మీరు మీ జీవితకాలంలో సరిగ్గా అదే ప్రదేశాన్ని సందర్శించి ఉండవచ్చు. లేదా మీరు ఒక స్థలాన్ని సందర్శించాలని చాలా కాలంగా కలలు కని ఉండొచ్చు. ఈ భూమిపై ఉన్న అన్ని ప్రదేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు. ఇక ఎంతో మంది తీసిన ఫొటోలు చూస్తూ ఆ ప్రాంతాల గొప్పతనం గురించి అందరికీ చాటుచెబుతున్నారు.
వాస్తవం ఏమిటంటే.. మనం ఎక్కడ ఫోటోలు తీస్తున్నామో.. ఎక్కువగా ఫోటో తీయబడిన ప్రదేశాలను ట్రాక్ చేయడం తాజాగా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతతో గతంలో కంటే సులభమైంది. సో ఎవ్వరు ఎక్కడ ఫొటో తీసిన ఆ ప్రాంతం ఏంటో ఈజీగా గుర్తుపడుతున్నారు. ఒక్క ఫొటో 1000 రూపాలకు ప్రతీక అని అంటారు. ప్రపంచంలోనే అత్యధిక మంది ఇష్టపడ్డ ఫొటోలు.. ఆ ప్రాంతాలు.. పదిలక్షల క్లిక్ లు పడ్డ ఫొటోల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే టాప్ 10 ఫొటోలు తీసిన ప్రదేశాలు కింద ఉన్నాయి. అందులో అమెరికాలోని న్యూయార్క్ ప్రపంచంలోనే నంబర్ 1గా నిలిచింది.
- న్యూయార్క్, అమెరికా

ప్రపంచంలో అత్యధికంగా ఫోటో తీసిన ప్రదేశాలలో ఒకటిగా అమెరికాలోని న్యూయార్క్ అగ్రస్థానంలో ఉంది. ఈ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 53 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది!
2. ప్యారిస్, ఫ్రాన్స్

ఫ్రాన్స్‌లోని పారిస్‌లోని ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే అత్యధికంగా ఫోటో తీయబడిన ప్రదేశాల జాబితాలో 2వ స్థానంలో ఉంది. పారిస్ దాని అందమైన కేఫ్‌లు, ల్యాండ్‌మార్క్ మ్యూజియంలు మరియు ఉద్యానవనాలు మరియు ప్రసిద్ధ పిక్నిక్ గమ్యస్థానాలతో నిండిన ప్యారిస్ భూతల స్వర్గంగా విరాజిల్లుతోంది.
3. లండన్, ఇంగ్లండ్

మూడో స్థానం. ఇంగ్లండ్ రాజధాని లండన్ ఉంది. బిగ్ బెన్ మరియు టవర్ బ్రిడ్జ్‌తో సహా దాని అందమైన మరియు ఫోటోజెనిక్ ల్యాండ్‌మార్క్‌ల కోసం ఒక ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానంగా ఉంది. లండన్ యొక్క అత్యంత గుర్తించదగిన ల్యాండ్‌మార్క్‌లలో ఒకటి,
4. బ్యూనస్ ఎయిరిస్, కామినిటో

నాలుగో స్థానంలో బ్యూనస్ ఎయిర్స్ ఉంది. ఈ నగరం రంగుల యూరోపియన్-శైలి నిర్మాణంతో ఆకట్టుకుంటోంది. ప్రపంచంలోని అత్యంత ఫోటోగ్రాఫ్ చేయబడిన ప్రదేశాలలో ఒకటిగా మారింది. ఉత్తమ చిత్రాలు పొందడానికి అనేక ప్రసిద్ధ ప్రదేశాలలో కామినిటో ఒకటి. ఈ పదానికి చిన్న నడక మార్గం అని అర్ధం మరియు దీనిని 1950 లలో కళాకారుడు బెనిటో క్విన్‌క్వెలా మార్టిన్ నిర్మించారు.
5. బార్సిలోనా, స్పెయిన్

6. రోమ్, ఇటలీ

7. వెనీస్, ఇటలీ

8.బూడాపెస్ట్, హంగెరీ

9.ఇస్తాంబుల్, టర్కీ

Also Read: కాంగ్రెస్ ను కాదని.. వందేళ్ల అధికారం మోడీకి సాధ్యమేనా?
10. ఫ్లోరెన్స్ , ఇటలీ
చివరగా ఇటలీలోని ఫ్లోరెన్స్, ప్రపంచంలోనే అత్యధికంగా ఫోటో తీసిన ప్రదేశాలలో 10వ స్థానంలో ఉంది. అత్యంత గుర్తింపు పొందిన మరియు ఫోటో తీయబడిన ల్యాండ్‌మార్క్‌లలో ఒకటి డ్యూమో. ఈ అందమైన ఎర్రటి గోపురం ఆకట్టుకునేలా కనిపిస్తుంది.

Also Read: టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. మధ్యలో దళితులు