Homeఎంటర్టైన్మెంట్Balakrishna Movie Rejected By Nithiin: బాలయ్య సినిమాలో చేయనని చెప్పిన స్టార్ హీరో ఎవరో...

Balakrishna Movie Rejected By Nithiin: బాలయ్య సినిమాలో చేయనని చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Balakrishna Movie Rejected By Nithiin: నందమూరి నటసింహం బాలయ్య బాబు భారీ సక్సెస్ లను సాధిస్తున్నాడు. బోయపాటితో చేసిన ‘అఖండ 2’ సినిమా కొంతవరకు నిరాశపర్చినప్పటికి అంతకుముందు చేసిన నాలుగు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ప్రస్తుతం సీనియర్ హీరోల్లో తను టాప్ పొజిషన్లో దూసుకెళ్తున్నాడు. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇంతకు ముందు వీళ్ళ కాంబోలో వీర సింహ రెడ్డి అనే సినిమా వచ్చింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ ను సాధించింది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలు మూస ధోరణిలో ఉండేవి…కానీ ఇప్పటి నుంచి ఆయన చేయబోతున్న పాత్రలు ప్రేక్షకులను అలరించాలని తద్వారా ఆయనకంటు ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. తను చేస్తున్న ప్రతి సినిమా తన అభిమానులను దృష్టిలో పెట్టుకుని చేస్తానని గతంలో చెప్పిన బాలయ్య ఇప్పుడు కూడా అదే ఫార్మాట్ ను ఫాలో అవుతూ ముందుకు సాగుతున్నాడు.

Also Read: మంచు విష్ణు ఆ ఒక్క సినిమా నాకోసం వదిలేయమని ప్రభాస్ ను అడిగాడా..? ఆ సినిమా ఏంటంటే..?

గతంలో బాలయ్య బాబు సినిమాలో నటించమని ఒక స్టార్ హీరో నైతే అడిగారట. కానీ అతను మాత్రం బాలయ్య బాబు సినిమాలో నటించనని చెప్పాడట. కారణం ఏంటంటే బాలయ్య ముందు నటించడం అంటే పెద్ద సాహసం అంటూ చెప్పి తప్పించుకున్నాడట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అంటే నితిన్ గా తెలుస్తుంది. అయితే బాలయ్య బాబు చేసిన ‘అధినాయకుడు’ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉందట…

దానికి నితిన్ ని అడగగా నితిన్ నో చెప్పడంతో ఆ క్యారెక్టర్ ని సినిమాలో నుంచి తీసేసి సినిమా స్టోరీని మరో విధంగా మలిచినట్టుగా తెలుస్తుంది. నితిన్ బాలయ్య బాబు సినిమాలు నటించడానికి ఎందుకు భయపడ్డాడు అంటే బాలయ్య ముందు నటించే కెపాసిటీ తనకు లేదని అందువల్లే రిజెక్ట్ చేశాడు అంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. బాలయ్య సినిమాను నితిన్ రిజెక్ట్ చేశాడు అంటూ సోషల్ మీడియా మొత్తం ఇవే హైలైట్ అవుతుండడం విశేషం…

అప్పట్లో నితిన్ వరుస ఫ్లాప్ ల్లో ఉండడం వల్ల దర్శకుడు పరుచూరి మురళి ఆ పాత్ర నితిన్ కి మంచి గుర్తింపు తీసుకువస్తుందని భావించారట. కానీ అనుకోని కారణాలవల్ల తను నో చెప్పడంతో ఆ పాత్రని సైతం సినిమా నుంచి తీసేసినట్టుగా తెలుస్తుంది. సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఒకరకంగా నితిన్ ఆ పాత్రను చేయకపోవడమే మంచిదైంది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తుండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular