https://oktelugu.com/

‘సాగునీరు పనులను వేగవంతం చేయండి’

  నిర్మల్ జిల్లాలోని 27-ప్యాకేజీ పంప్‌ హౌస్‌ పనులను అటవీ ,పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సందర్శించారు. ఈసందర్భంగా పంట కాలువ నిర్మాణం పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకంలో భాగంగా కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ప్రతి ఎకరాలకు నీళ్లందించేలా దృష్టిసారించాలన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా పంటలకు సాగునీరు అందించే దిశగా పనుల్లో వేగం పెంచాలన్నారు. గోదావరి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 30, 2020 / 04:02 PM IST
    Follow us on

     

    నిర్మల్ జిల్లాలోని 27-ప్యాకేజీ పంప్‌ హౌస్‌ పనులను అటవీ ,పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సందర్శించారు. ఈసందర్భంగా పంట కాలువ నిర్మాణం పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకంలో భాగంగా కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ప్రతి ఎకరాలకు నీళ్లందించేలా దృష్టిసారించాలన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా పంటలకు సాగునీరు అందించే దిశగా పనుల్లో వేగం పెంచాలన్నారు.

    గోదావరి ఆధారిత కాళేశ్వరం 27, 28 ప్యాకేజీ పనుల్లో నిర్మల్‌, ముదోల్‌ నియోజక వర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన పనులు కొనసాగుతున్నాయని అన్నారు. 65శాతం పనులు పూర్తయ్యాయని ఇంకా 35శాతం పూర్తికావాల్సి ఉందన్నారు. మాడేగావ్‌ వద్ద నిర్మిస్తున్న అండర్‌ టన్నుల్‌ పనులు దాదాపుగా పూర్తికావచ్చాయన్నారు ఇంకా 5 కి.మీ.లకు గాను నాలుగున్న కిలోమీటర్ల పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. ఈ ప్యాకేజీ పనులు పూర్తయితే నిర్మల్‌ జిల్లా మరింత సస్యశ్యామం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ, ఎస్‌ఆర్‌ఎస్పీ సీఈ శంకర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.