Indira gandhi And Modi: అదృష్టవషత్తు మనవద్ద అత్యాధునిక ఆయుధాలు.. ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఇన్ని రోజులపాటు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆర్మీ ఈ స్థాయిలో యుద్ధం చేస్తే.. పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలను మట్టు పెడితే.. జేజేలు పలికిన జాతి.. అమెరికా ఒక్క ఫోన్ చేయగానే భారత్ సైలెంట్ అయిపోవడం తో ఇప్పుడు అన్ని వేళ్ళు మోడీ వైపు చూపిస్తున్నాయి. నిజంగా మోడీ అమెరికాకు భయపడ్డాడా? ప్రపంచం మీద పెత్తనం సడలిపోతున్న సమయంలో అమెరికాకు మోడీ ఎందుకు సరెండర్ అయినట్టు.. మోస్ట్ రోగ్ కంట్రీ విషయంలో ఎందుకు సైలెంట్ అయినట్టు.. నిజంగా మోడీ అగ్ర రాజ్యానికి భయపడ్డారా.. లేక సైలెంట్ గా ఏమైనా ప్లాన్ వేస్తున్నారా.. మోడీ ఎందుకు సైలెంట్ అయ్యారో తెలియదు కానీ.. ఈ దేశంలో నిన్నటిదాకా శత్రుదేశంతో యుద్ధం వద్దు అని చెప్పిన గొంతులే ఇప్పుడు కొత్తగా అరుస్తున్నాయి.. మోదీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. మోడీ ప్రపంచ పెద్దన్నకు తలవంచాడని సోషల్ మీడియాలో వెర్రి కేకలు వేస్తున్నాయి.
Also Read: సీజ్‌ఫైర్ వద్ద: పాక్ తో ’భారత్ యుద్ధమే కావాలి
ఇందిరా లో కనిపించిన ధైర్యం మోడీలో లేదా
ఇందిరాగాంధీ 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు అమెరికాను ఎదిరించారు. ఆగ్రరాజ్యం ఆధిపత్యాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేశారు. బంగ్లాదేశ్ ను పార్లమెంటు వేదికగా గుర్తించారు. అంతేకాదు ఏకంగా లక్షకి మించిన పాకిస్తాన్ సైనికులను యుద్ద ఖైదీలుగా పట్టుకున్నారు. పాకిస్తాన్ కు అమెరికా ఇచ్చిన యుద్ధ ట్యాంకులను రాజస్థాన్ వేదికగా కూల్చి పడేశారు.. అంతేకాదు అంతటి అమెరికా బర్మా షెల్ అనే కంపెనీ ద్వారా చమురు సరఫరాను భారతదేశానికి నిలిపివేస్తే … అప్పటికప్పుడు ఇందిరా గాంధీ తన దౌత్య నీతి ద్వారా ఉక్రెయిన్ దేశం నుంచి చమురు తప్పించుకున్నారు. అంతేకాదు ఏకంగా ఇండియన్ ఆయిల్ అనే కంపెనీని కూడా ఏర్పాటు చేశారు. తద్వారా నాటి నిక్సన్ ఆధ్వర్యంలో అమెరికా ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఐరన్ లేడీగా పేరుపొందారు. నాడు పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపించారు. అయితే నాడు ఇందిరాగాంధీ హయాంలో పిఓకేను స్వాధీనం చేసుకునే అవకాశం వచ్చినప్పటికీ ఆమె ఎందుకనో సైలెంట్ అయిపోయారు. అంతేకాదు పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను కూడా వదిలిపెట్టారు. ఇన్ని అవకాశాలను ఇందిరాగాంధీ వదులుకున్నారు కాబట్టే.. ఇప్పుడు దాని ఎఫెక్ట్ భారత్ మీద కనిపిస్తోంది. పాకిస్తాన్ వల్ల భారత్ నిత్యం ఇబ్బంది పడుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఐరన్ లేడీ కి వచ్చినట్టుగానే మోడీకి కూడా టెర్రరిస్ట్ కంట్రీ పై పూర్తిస్థాయిలో అప్పర్ హ్యాండ్ చూపించే అవకాశం వచ్చింది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను స్వాధీనం చేసుకునే సువర్ణ అవకాశం కూడా లభించింది. ఇంతటి అవకాశాలను మోడీ ఎందుకు వదులుకుంటున్నట్టు.. నిత్య యుద్ద పిపాసి అమెరికా మాట ఎందుకు వింటున్నట్టు.. ప్రపంచం మీద అమెరికా పెత్తనం తగ్గిపోతున్న సమయంలో మోడీ ఎందుకు తలవంచినట్టు.. మోడీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారా.. దీనికంటే పెద్ద ఎక్స్పోజర్.. ఎక్స్ ఫ్లోజర్ ను అటు పాకిస్తాన్ కు.. ఇటు అమెరికాకు చూపించబోతున్నారా.. ఏమో ఈ ప్రశ్నలకు కాలం గడిస్తే తప్ప సమాధానాలు లభించదు. కానీ ఇప్పటికైతే మోడీ మౌనం వల్ల నిన్నటిదాకా హీరోగా వెలుగొందిన అతడు.. ఇప్పుడు ఒక్కసారిగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వీటికి సమాధానం చెప్పడం బిజెపి వల్ల కావడం లేదు.. చూడాలి మరి ఏం జరుగుతుందో..