G7 Summit: ఆ మధ్య మన ప్రధాని నరేంద్ర మోడీ ఇటలీ వెళ్ళినప్పుడు.. ఒక చిన్న చాక్లెట్ ప్యాకెట్ తో సర్ప్రైజ్ చేశారు. ఇటలీ ప్రధాని మెలోనికి దానిని ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆ చాక్లెట్ బ్రాండ్ పేరు మెలోడీ. ఆమె పేరు మెలోడీ కాబట్టి మెలోడీ చాక్లెట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. దానికి ఆమె కూడా సంతోషం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ మెలోడీ ఇచ్చిన తర్వాత ఆ కంపెనీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత మెలోడీ చాక్లెట్ల విక్రయాలు కూడా మనదేశంలో పెరిగిపోయాయి.
ఇటీవల ఫ్రాన్స్ లో g7 సమ్మిట్ జరిగినప్పుడు ప్రపంచ దేశాల అధినేతల కంటే ఎక్కువగా మోడీతో మెలోని మాట్లాడింది. ఆయనతో కలిసి ఫోటోలు దిగింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య మరొకసారి ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించిన చర్చలు సాగాయి. ఇటలీతో భారతదేశానికి వ్యాపార సంబంధాలు మరింత మెరుగుపరచడానికి నరేంద్ర మోడీ అడుగులు వేస్తే.. మెలోని స్వాగతించారు.
మెలోడీ చాక్లెట్లు తీసుకున్నంత స్వీట్ కాదు మెలోనీ. ఎందుకంటే తను ఒక అగ్గి బరాటా. ఒక ముక్కలో చెప్పాలంటే శివంగి. ఏకంగా అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ కు కోసి కారం పెట్టింది. ఆమెలో ఇంత ఆగ్రహం పెరగడానికి.. ఆమె ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన నెత్తి మాసిన వ్యాఖ్యలు.
ఇటీవల ఫ్రాన్స్ లో g7 సమ్మిట్ జరిగినప్పుడు తనతో ఫోటోలు దిగడానికి మెలోని వేడుకున్నారని ట్రంప్ ఆరోపించారు. ఆయన మాట్లాడిన మాటలు గ్లోబల్ మీడియాలో విస్తృతంగా ప్రసారమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న మెలోని వెంటనే స్పందించారు. ఒక స్వీయ వీడియోలో అమెరికా అధ్యక్షుడికి ఇచ్చి పడేశారు. ” మేము ఎవరితో ఫోటోలు దిగాలని అనుకోలేదు. ఫోటోలు దిగడానికి వేడుకోలేదు. నేను గాని.. మా ఇటలీ గాని ఆ పని చేయదు. ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. ఆయన పశ్చిమ దేశాలలో శత్రువుల మీద చూపించిన గౌరవం కూడా మా మీద చూపించడం లేదు. అయినప్పటికీ గౌరవాన్ని మేము కోరుకోము. ఎవరికి తలవంచము. ఫోటోలు దిగాలని బతిమిలాడమని” మెలోనీ వ్యాఖ్యానించింది. యూరప్ ప్రాంతంలో ట్రంప్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఈ స్థాయిలో ఇంతవరకు ఏ అధ్యక్షుడుగాని ప్రధానమంత్రి గాని ఇవ్వలేదు. పైగా మెలోని ఈ స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో అమెరికా అధ్యక్షుడి పరువు మరోసారి బజారు పాలైంది.
మెలోని ఇటలీకి ప్రధానమంత్రి అయిన తర్వాత తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఇతర దేశాల మీద ఇటలీని ఆధారపడే విధానాన్ని పూర్తిగా తగ్గించారు. ముఖ్యంగా వాణిజ్యాన్ని సరికొత్త దిశలో తీసుకెళ్తున్నారు. అందువల్లే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమె మీద మండిపడుతున్నారని గ్లోబల్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించిన ఎంవోయూలు కుదుర్చుకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు మండిపడుతున్నారని.. చివరికి ఆ కోపాన్ని ఇలా బయటపెట్టారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
BREAKING: Italian PM Giorgia Meloni completely destroys Donald Trump!
She calls his statements totally invented and is appalled he attacks allies while appeasing enemies of the West.
She delivers a brutal final warning: “Italy and I never beg.” Washington is isolated! pic.twitter.com/iiS5JXZxiv
— Furkan Gözükara (@FurkanGozukara) June 19, 2026
