Indigo Emergency Landing Bengaluru: మనదేశంలో ఇటీవలి కాలంలో విమానాలలో సాంకేతిక సమస్యలు వెలుగు చూస్తున్నాయి. ఫలితంగా విమాన సర్వీసులు అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాలలోనే ఈ తరహా సమస్యలు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 200కు పైగా ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. అభిమానం స్థానికంగా ఉన్న ఓ వైద్య కళాశాల మీద కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఆ కాలేజీలో ఉన్న విద్యార్థులు గాయపడ్డారు. మృతి చెందిన వారికి, గాయపడిన వారికి ఎయిర్ ఇండియా సంస్థ పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది.
Also Read: Air India Crash : ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. మరో అద్భుతం వెలుగులోకి..
అయితే అభిమానంలో ముందుగానే ఓ ప్రయాణికుడు సాంకేతిక సమస్యను గుర్తించాడు. ఆ విషయాన్ని ఎయిర్ ఇండియా యాజమాన్యానికి.. భారత పౌర విమానయాన సంస్థకు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అయితే అతడి సూచనను ఆ రెండు సంస్థలు కూడా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇక అప్పట్నుంచి మన దేశంలో ప్రయాణిస్తున్న చాలా విమానాలలో సాంకేతిక సమస్యలు వెలుగు చూశాయి. ముఖ్యంగా అంతర్జాతీయ సర్వీసులు అందించే విమానాలలోనే ఈ తరహా సమస్యలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. అందువల్లే చాలామంది ప్రయాణికులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. విమానాలలో వెలుగు చూస్తున్న సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
168 మంది ప్రాణాలతో బయటపడ్డారు
దేశంలో అంతర్జాతీయ విమానాలలో సమస్యలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో.. ఇటీవల బెంగళూరు నగరంలో చోటుచేసుకున్న ఓ సంఘటన దిగ్బ్రాంతికి గురి చేసింది. బెంగళూరు విమానాశ్రయంలో ఇండిగో సంస్థకు చెందిన విమానం అర్ధాంతరంగా ల్యాండ్ అయింది. అయితే ఆ ఫ్లైట్లో పైలట్ మే డే కాల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గుహవాటి నుంచి చెన్నై వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య వెలుగు చూసింది. దీంతో విమానాశ్రయ సిబ్బందికి ఆ ఫ్లైట్ నడిపే పైలెట్ మేడే కాల్ ఇచ్చారు. దీంతో ఫ్లైట్ లాండింగ్ కు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఫలితంగా 168 మంది ప్రయాణికులు సురక్షితంగా దిగారు. పైలట్ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యాడు. సమీప విమానాశ్రయమైన బెంగళూరు ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం అందించాడు.
దీంతో వారు ఎమర్జెన్సీ లాండింగ్ కు ఏర్పాటు చేశారు. ఫలితంగా ఇండిగో విమానం వెంటనే బెంగళూరు విమానాశ్రయంలో దిగిపోయింది. ఆ సమయంలో ఆ విమానంలో 168 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇక విమానాలలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పుడు పైలెట్లు మే డే కాల్ ప్రకటిస్తారు. దానివల్ల సమీప విమానాశ్రయంలో అధికారులు అప్రమత్తమవుతారు. సదరు విమానం వెంటనే దిగడానికి ఏర్పాట్లు చేస్తారు. యుద్ధం, వాతావరణంలో మార్పులు, విమానాలలో సాంకేతిక సమస్యలు లేదా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మేడే కాల్ ఇవ్వడానికి పైలెట్లకు అవకాశం ఉంటుంది.