Celebrities Died In Plane Crashes: ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన ఘటనలో మొత్తం 242 మంది కన్నుమూశారు. ఇందులో భారతీయులు 169 మంది ఉన్నారు. బ్రిటిష్ దేశానికి చెందినవారు 53 మంది ఉన్నారు. పోర్చుగీసుదేశానికి చెందినవారు ఏడుగురు, కెనడా దేశానికి చెందినవారు ఒక్కరు ఉన్నారు.. విమానం నడిపే పైలెట్స్ ఇద్దరు, ఎయిర్ హోస్టర్స్ పదిమంది ఉన్నారు.. గుజరాత్ ఆర్థిక రాజధానిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారు. అదే చనిపోయిన వారిలో ఈయన ఒక్కడే సెలబ్రిటీ అని తెలుస్తోంది. 200 మందికి పైగా కన్నుమూసిన నేపథ్యంలో దేశంలోనే అత్యంత దారుణమైన విమాన ప్రమాదమని అధికారులు చెబుతున్నారు. ఇక మనదేశంలో విమాన ప్రమాదాలు కొత్తకాక పోయినప్పటికీ.. గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు చాలామంది సెలబ్రిటీలు కన్నుమూశారు.
Also Read: అహ్మదాబాద్ దారుణానికి ఎయిర్ ఇండియా నిర్లక్ష్యమే కారణమా? వెలుగులోకి సంచలన నిజం!
గతంలో చనిపోయిన సెలబ్రిటీలు వీరే
మనదేశంలో గతంలో చోటు చేసుకున్న విమాన ప్రమాదాలలో చాలామంది రాజకీయ ప్రముఖులు కన్నుమూశారు. ఇందులో సినీ రంగానికి చెందిన వారి కూడా ఉన్నారు. దివంగత ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా కూడా విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. పార్లమెంట్ స్పీకర్ జిఎంసి బాలయోగి కూడా విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఈ తరహా ప్రమాదంలోనే కన్నుమూశారు. దోర్జీ ఖండు, ఓపి జిందాల్, విజయ్ రూపాని వంటి రాజకీయ ప్రముఖులు కూడా విమాన ప్రమాదాలలో దుర్మరణం చెందారు. మన దేశాన్ని చెందిన మొట్టమొదటి సిడిఎస్ బిపిన్ రావత్, అనుశాస్త్రవేత్త హోమి జే బాబా, సినీనటి సౌందర్య విమాన ప్రమాదాలలో దుర్మరణం పాలయ్యారు. ఇక ప్రఖ్యాత వైద్యుడు నాయుడమ్మ విమానంలో ప్రయాణిస్తుండగా గుండెపోటు రావడంతో ఆయన దుర్మరణం పాలయ్యారు.. ఇక అహ్మదాబాద్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన మన దేశ చరిత్రలో అత్యంత విషాదం నింపింది. అక్కడ దృశ్యాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది.
అహ్మదాబాదులో ఎయిర్ ఇండియా విమానం కుప్ప కూలిపోవడానికి కారణాలు ఇంతవరకు తెలియడం లేదు. వాతావరణంలో మార్పులు ఏమైనా చోటు చేసుకున్నాయా? విమానంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా? ఇంకా ఏదైనా సమస్యలు ఎదురయ్యాయా? అందువల్లే విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పటికే అధికారులు ఈ సంఘటనపై విచారణ మొదలుపెట్టారు. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.. ప్రమాదానికి ఒకవేళ మానవ తప్పిదమే కారణమైతే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.