Indigenous weapons: మొన్నటి దాకా మన రక్షణ రంగ ఆయుధాల కోసం అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, రష్యా మీద ఆధారపడే వాళ్ళం. బహుశా ఇక ఆ పరిస్థితి ఉండక పోవచ్చు. ఎందుకంటే మన అమ్ముల పొదిలో అనేక ఆయుధాలు అది కూడా స్వదేశీ వి ఉన్నాయి. కాదు కాదు తయారయ్యాయి. చిన్న వాటికి సైతం ఇతర దేశాల మీద ఆధార పడే మనం ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా పెద్ద తతంగమే నడిచింది. ఇక దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న ఐదో జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానం డిజైన్ బయటికి వచ్చింది. ఆగస్ట్ 15 న 75 వసంతాల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్న వేళ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ మీడియం కంబాక్ట్ డిజైన్ ని విడుదల చేశాయి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఆధునాతనమయిన యుద్ధ విమానాలు ఉన్నా ఐదో జెనరేషన్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ లేని కొరత ఉంది. ఐదో జెనరేషన్ యుద్ధ విమానం కొనాలి అంటే అమెరికా నుంచి మాత్రమే కొనాలి. కానీ అది చాలా ఖరీదయిన వ్యవహారం పైగా అమెరికా ఇంతవరకు భారత్ కి తన F-35 ని కొనమని ఆఫర్ ఇవ్వలేదు. F-22 స్టెల్త్ ఫైటర్ జెట్ అమెరికా ఎయిర్ ఫోర్స్ వరకే పరిమితం చేసింది తప్పితే బయటి దేశాలకి అమ్మలేదు. F-22 ప్రొడక్షన్ ని ఆపేసి చాలా కాలం అయ్యింది కాబట్టి ఇకముందు వేరే దేశానికి అమ్మే అవకాశం లేదు.
ఇప్పటివరకు ప్రపంచంలో మూడు దేశాలు మాత్రమే 5th జెనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ లని తయారు చేయగలిగాయి. అమెరికా చాలా ముందు ఉంది. F-22 రాప్టార్, ఎఫ్ -35 లైటింగ్ -2 లని తయారుచేసి అగ్రస్థానం లో కొనసాగుతున్నది. ఇక రష్యా ఎస్ యూ-57 ని తయారుచేసింది. కానీ అది ఇప్పటికీ ఫైనల్ ఆపరేషన్ కోసం అనుమతి రాలేదు. రష్యా 5th జనరేషన్ కి సంబంధించి ఏఈఎస్ఏ రాడార్ ని అభివృద్ధి చేయడంలో మన కంటే వెనుకపడి ఉంది. ఎస్యూ-57 పేరుకే ఐదవ జెనరేషన్. కానీ ఈ విమానానికి కావాల్సిన ఇంజిన్ లని ఇంకా పూర్తిగా అభివృద్ధి చేయలేకపోయింది. ఎలెక్ట్రానిక్ వార్ ఫేర్ సూట్ విషయంలో చాలా వెనకపడి ఉంది. కాబట్టి యుద్ధ రంగ నిపుణులు రష్యా కి చెందిన ఎస్ యూ -57 ని ఐదవ జనరేషన్ అని పిలవడానికి ఒప్పుకోవట్లేదు. ఇక చైనా J-20 ఐదవ జనరేషన్ ఫైటర్ జెట్ ని ఆపరేట్ చేస్తున్నది ఇప్పటికే కానీ దాని పని తీరు ఎలా ఉంటుందో చైనా కి తప్పితే వేరే దేశానికి తెలియదు.
ఆరో జనరేషన్ తయారీ జరుగుతోంది
మన దేశానికి రాఫెల్ జెట్స్ ని అమ్మిన ఫ్రాన్స్ కి చెందిన డసాల్ట్ ఏవియేషన్ జర్మనీ తో కలిసి ఆరో జెనరేషన్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ ని అభివృద్ధి చేసే పనిలో ఉంది. 2035 నాటికి మొదటి ఆరో జెనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించి ప్రోటో టైపు విమానం బయటికి రావొచ్చు అని అంచనా! అంటే ఫ్రాన్స్ ఐదవ జెనరేషన్ ని తప్పించి ఏకంగా ఆరో జనరేషన్ కి ప్లాన్ చేస్తున్నది ఎందుకంటే 2035 నాటికి అమెరికా కూడా తన ఆరో జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ని బయటికి తెస్తుంది కాబట్టి అప్పటికి ఐదవ జనరేషన్ పాత పడిపోతుంది.
ఇక మనదేశానికి వస్తే గతంలో రష్యా తో కలిసి ఉమ్మడిగా ఐదవ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ కోసం పని చేశాయి కానీ ఇంజిన్ డిజైన్,ఏవియానిక్స్ విషయంలో రష్యా డిజైన్స్ నచ్చక భారత్ మధ్యలోనే బయటికి వచ్చి స్వంతంగా తయారుచేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం సరయినదే అని ఎస్ యూ-57 నిరూపించింది. ఎందుకంటే రష్యన్ ఎయిర్ ఫోర్స్ ఇంతవరకు 6 ఎస్ యూ -57 లని మాత్రమే ఆపరేట్ చేస్తున్నది తప్పితే అంతకంటే ఎక్కువ సుఖోయ్ కార్పొరేషన్ కి ఆర్డర్ ఇవ్వలేదు. అయితే భారత్ మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ నుండి బయటికి రావడానికి కారణం అయిన ఇంజిన్,ఈఏఎస్ఏ రాడార్ ల డిజైన్ బాగలేకపోవడమే అని భావించడం ఇప్పుడు రష్యన్ ఎయిర్ ఫోర్స్ కూడా 6 విమానాల కంటే ఎక్కువ ఆర్డర్ ఇవ్వకపోవడం మన ఇంజినీర్ల నిర్ణయం కరెక్ట్ అని నిరూపిస్తున్నది.
నిన్న ఏ డి ఏ, హెచ్ ఏ ఎల్ లు విడుదల చేసిన అడ్వాన్స్డ్ మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ ని విండ్ టన్నెల్ డిజైన్ అని పిలుస్తారు.ఏ ఎం సి ఏ విండ్ టన్నెల్ మోడల్ మొదటిగా డైవర్ట్ లెస్ సూపర్ సానిక్ ఇనలేట్ ని చూస్తే రాడార్ సిగ్నల్స్ ని స్వీకరిస్తూ తిరిగి వాటిని రిఫ్లెక్ట్ చేయకుండా తనలో ఇముడ్చుకోవడం లేదా వాటిని ఏ రాడార్ నుంచి వచ్చాయో ఆ రాడార్ కి తిరిగి వెళ్ళకుండా ఉండేట్లుగా డిజైన్ చేశారు. ఇది స్టెల్త్ లక్షణాలలో మొదటి లక్షణంగా చెప్తారు. విమానం ఇంజిన్ లోకి గాలిని తీసుకునే డక్ట్ లు రాడార్ సిగ్నల్స్ ని రిఫ్లెక్ట్ చేసి శత్రు రాడార్ లకి తమ ఉనికిని తెలియచేస్తుంటాయి కానీ స్టెల్త్ డిజైన్ వల్ల రాడార్ సిగ్నల్స్ వేరే దిశలోకి వెళ్ళిపోయి శత్రు దేశపు రాడార్ లకి అందవు కనుక దగ్గరికి వచ్చే వరకు రాడార్ స్క్రీన్ మీద కనపడవు.

ఇక ముందు వైపు ముక్కు నుంచి కాక్ పిట్ వరకు ‘3D’ బంప్ డిజైన్ ని చూస్తే రాడార్ సిగ్నల్స్ ని దారి మళ్లించే విధంగా ఉంది అదే సమయంలో ముక్కు భాగంలో ఐఆర్ఎస్టీ తో పాటు రాడార్ కూడా ఉండేట్లుగా డిజైన్ చేశారు. ఇవి మీడియం, లాంగ్ రేంజ్ టార్గెట్ లని గుర్తించగల విధంగా ఉంటాయి. ఐ ఆర్ఎస్టి రేంజ్ 100 కిలోమీటర్లు, మరింత అభివృద్ధి చేయబడిన ఉత్తమ్ ఈఏఎస్ఏ రాడార్ 200కి.మీ రేంజ్ కలిగి ఉండవచ్చు. ఉత్తమ్ ఏఈఎస్ఏ రాడార్ మన దేశంలోనే తయారుచేస్తున్నారు.
ఏఎంసీఏ డిజైన్ చూస్తే ఇంటర్నల్ టాంక్ తో పాటు మిసైల్స్ ని కూడా విమానం లోపలి భాగం లో ఉండేట్లుగా ఉంది. అవసరం అయితే నాన్ స్టెల్త్ మోడ్ తో విమానం రెక్కల కింద కూడా మిసైల్స్ ని మోసుకు పోయే విధంగా డిజైన్ చేశారు. ఇక ఏఎం సీఏ ఆకాశంలో, భూమి మీద ఉండే టార్గెట్ల ని ధ్వంసం చేయగలదు. ఇక ప్రధానంగా ఇంజిన్ గురించి అయితే రెండు ఇంజిన్లు కలిగి ఉండే విధంగా డిజైన్ చేశారు. అయితే ఇంజిన్ల విషయం లో ఫ్రాన్స్ కి చెందిన స్నేక్మ ఇంజిన్ల ని వాడబోతుందా? లేక అమెరికన్ జీఈ 414 లని వాడుతుందా ? లేకపోతే ఇప్పటికే పురోగతిని సాధించిన మన స్వదేశీ ‘కావేరీ ‘ ఇంజిన్ ని వాడుతుందా అనేది తెలియడానికి మరో రెండేళ్ళు వేచి చూడాల్సి ఉంటుంది.
ప్రస్తుతానికి వెండి టన్నెల్ మాత్రమే బయటకు వచ్చింది
ప్రస్తుతం విండ్ టన్నెల్ డిజైన్ మాత్రమే బయటికి వచ్చినా.. మొదటి ప్రోటో టైప్ విమానం బయటికి రావడానికి మరో ఏడు ఏళ్లు ఆగాల్సి ఉంటుంది. అలాగే ప్రోటో టైప్ బయటికి వచ్చాక దానికి ఇనీషియల్ ఆపరేషన్ సర్టిఫికెట్ రావడానికి మరో రెండేళ్ళు మన ఎయిర్ ఫోర్స్ మార్పులు,చేర్పులు అడిగితే వాటిని అప్లై చేయడానికి మరో రెండేళ్ళు పడుతుంది. 2032 నాటికి ఫైనల్ ఆపరేషన్ సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐదవ జనరేషన్ తో మొదలుపెట్టినా క్రమంగా అది పూర్తయి బయటికి వచ్చే సమయానికి 5++++ గా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయి. అంటే కాస్త అటూ ఇటుగా ఆరో జనరేషన్ లక్షణాలు ఉంటాయన్నమాట.
మొదటి విమానం బయటికి రావడానికి అన్ని సంవత్సరాలు పడుతుందా ? అంటే పడుతుంది. అమెరికన్ F-22 కి డిజైన్ దశ నుంచి మొదటి విమానం బయటికి రావడానికి పట్టిన కాలం 18 సంవత్సరాలు. అలాగే F-35 బయటికి రావడానికి పట్టిన కాలం 17 ఏళ్లు కానీ ఇంకా అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. రాఫెల్ మొదటి విమానం బయటికి రావడానికి పట్టిన కాలం 13 ఏళ్లు అదీ మీరేజ్ 2000 ని అప్ గ్రేడ్ చేసిన డిజైన్ కాబట్టి 13 ఏళ్లు పట్టింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఒక్క చైనా తప్పితే మిగిలిన ఏ దేశం కూడా 15 ఏళ్ల లోపు ఏ విమానాన్ని బయటికి తీసుకురాలేకపోయాయి. కాబట్టి మొదటి విండ్ టన్నెల్ డిజైన్ నిన్ననే బయటికి వచ్చింది కాబట్టి మన ఏఎంసీఏ కి 12 ఏళ్లు పడుతుంది. మరో వైపు తేజస్ మార్క్-II పని కూడా సమాంతరంగా జరుగుతున్నది. యుద్ధ విమానాల ప్రొడక్షన్ లైన్ ఎప్పుడూ పని చేస్తూ ఉండాలి అంటే తగినన్ని ఆర్డర్లు ఉంటూ ఉండాలి నిత్యం లేకపోతే తీవ్రమయిన ఆర్ధిక నష్టాలని చవి చూడాల్సి ఉంటుంది.
ఏఎంసీఏ పని మొదలుపెట్టమని ప్రధాని కార్యాలయం నుంచి సంకేతాలు అందడమే కాదు దానికి కావాల్సిన నిధులని కూడా విడుదలయ్యాయి. ఒక వైపు మన రక్షణ రంగ ఉత్పత్తులని విదేశాలలో మార్కెటింగ్ చేస్తూ తగినన్ని ఆర్డర్లు ఉండేలా చూస్తూ, మరోవైపు ఏ డి ఏ, హెచ్ ఏ ఎల్ , డిఆర్డిఓ లకి నిధులని సమకూరుస్తూ ప్రోత్సహించడం లో ప్రధాని మోడీ ఇస్తున్న ప్రాధాన్యం వల్లనే ఇంత వేగంగా రక్షణ రంగం అభివృద్ధి జరుగుతోంది.
Also Read:Nuclear War: అణుయుద్ధం ఈ ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా? ఎంత మంది మరణిస్తారంటే?