Homeజాతీయ వార్తలుIndri Whisky: ఈ ఇండియన్ విస్కీ బ్రాండ్ కు అరుదైన గుర్తింపు..ఎగబడుతున్నారంతే..

Indri Whisky: ఈ ఇండియన్ విస్కీ బ్రాండ్ కు అరుదైన గుర్తింపు..ఎగబడుతున్నారంతే..

Indri Whisky: ఇండియాకు చెందిన విస్కీ బ్రాండ్‌ ‘ఇంద్రీ’కి అరుదైన గుర్తింపు దక్కింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విస్కీగా ఘనత సొంతం చేసుకుంది. పూర్తిగా భారత్‌తో తయారైన ఈ బ్రాండ్‌ దేశంతోపాటు విదేశాల్లోనూ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇంద్రీ బ్రాండ్‌ అమ్మకాల్లోనూ రికార్డులు తిరగరాస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 599 శాతం వృద్ధి నమోదు చేసింది. భారత్‌లో 30 శాతం వాటా కలిగి ఉంగా, ప్రీమియం స్పిరిట్స్‌ రంగంలో ఇంద్రీ అగ్రగామిగా నిలిచింది.

అచనాలను మించి సేల్స్..
స్కాట్‌లాండ్, జపాన్, తైవాన్‌ మొదలైన దేశాల నుంచి ఏ ఒక్క మాల్స్‌ విస్కీ కూడా ప్రారంభించిన రెండేళ్లలో 1,00,000 సేల్స్‌ మైలురాయిని అధిగమించలేదు. భారత్‌ బ్రాండ్‌ విస్కీ ఇంద్రీ మాత్రం అసాధారణ రీతిలో ఈ ఫీట్‌ను అధిగమించింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న సింగిల్‌ మాల్ట్‌ విస్కీల క్లబ్‌లో స్థానం దక్కించుకుంది.

14 పైగా అవార్డులు..
ఇక ఇంద్రీ విస్కీ స్పెషాలిటీ ఏమిటంటే.. లాంచ్‌ చేసి రెండేళ్లు మాత్రమే అవుతోంది. ఇంతలోనే 14 కన్నా ఎక్కువ అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. పికాడిల్లీ డిస్టిలరీస్‌ అనే కంపెనీ 2021లో హర్యానాలో మొదటిసారిగా ఇంద్రీ విస్కీని లాంచ్‌ చేసింది. ఈ విస్కీని భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు ధరలకు విక్రయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇంద్రీ సింగిల్‌ మాల్ట్‌ ఇండియన్‌ విస్కీని కొనుగోలు చేస్తే రూ.3,100కు లభిస్తుంది. మహారాష్ట్రలో కొనుగోలు చేస్తే రూ.5,100 లభిస్తుంది. ప్రస్తుతం ఈ మద్యం మన దేశంలోని 19 రాష్ట్రాల్లో అందుబాటులో ఉండగా, ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాల్లో లభిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version