LSG Vs DC: బలంగా లక్నో.. ఓటములతో ఢిల్లీ.. గెలుపెవరిది?

ఈ సీజన్ లోక్ కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లక్నో జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రాజస్థాన్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో ఓడిపోయిన లక్నో.. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 12, 2024 2:04 pm

LSG Vs DC

Follow us on

LSG Vs DC: ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా మరో రసవత్తర మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. లక్నో వేదికగా శుక్రవారం రాత్రి లక్నో, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. లక్నో జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడింది. మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ జట్టు ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడి కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. లక్నో జట్టుతో జరిగే మ్యాచ్ లు గెలిచి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఢిల్లీ జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాల గురించి ఒకసారి పరిశీలిస్తే..

ఈ సీజన్ లోక్ కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లక్నో జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రాజస్థాన్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో ఓడిపోయిన లక్నో.. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. గుజరాత్, పంజాబ్, బెంగళూరు జట్ల పై విజయాలు సాధించి ఏకంగా పాయింట్లు పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతోంది.. ఈ జట్టులో బ్యాటింగ్ భారాన్ని క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్ మోస్తున్నారు. అయితే మిగతా బ్యాటర్లు టచ్ లోకి రావాలని లక్నో జట్టు కోరుకుంటున్నది. ఈ జట్టు తన చివరి మ్యాచ్ గుజరాత్ తో ఆడింది. ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసిన లక్నో జట్టు.. ఆ తర్వాత గుజరాత్ జట్టును 130 కి ఆల్ అవుట్ చేసింది. అంతకుముందు బెంగళూరు తో మ్యాచ్ జరిగితే.. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 181 పరుగులు చేసింది. బెంగళూరును 153 కే ఆల్ అవుట్ చేసింది.. గత రెండు మ్యాచ్ లలో ఒక మోస్తరు స్కోరు సాధించినప్పటికీ.. లక్నో బౌలర్లు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. లక్నో బౌలింగ్ భారాన్ని మయాంక్ యాదవ్ మోస్తున్నాడు. అతడు వేగంగా బంతులు విసురుతుండడంతో ప్రత్యర్థి బ్యాటర్లు వణికి పోతున్నారు. అతడికి మిగతా బౌలర్లు సహకరిస్తే లక్నో జట్టుకు తిరుగు ఉండదు.

ఢిల్లీ జట్టు

ఈ సీజన్లో ఢిల్లీ జట్టు ఆట తీరు ఆశించినంత స్థాయిలో లేదు. పాయింట్లు పట్టికలో ఆ జట్టు చివరి స్థానంలో కొనసాగుతోంది. కీలక దశల్లో ఆటగాళ్లు చేతులు ఎత్తేస్తుండడంతో ఆ జట్టు మ్యాచ్ లు ఓడిపోతోంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు బలమైన చెన్నై సూపర్ కింగ్స్ పై మాత్రమే గెలుపొందింది. పంజాబ్, కోల్ కతా, రాజస్థాన్, ముంబై జట్లపై వరుసగా ఓడిపోయింది. ఇటీవల ఈ జట్టు తన చివరి మ్యాచ్ ను ముంబై పై ఆడింది. బౌలింగ్లో పస లేకపోవడంతో భారీ స్కోరు సమర్పించుకుం టున్నది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టి లక్ష్యానికి దగ్గరగా వచ్చి మ్యాచ్ చేజార్చుకుంది. ఈ జట్టులో రిషబ్ పంత్, పృథ్వి షా, స్టబ్స్ మాత్రమే రాణిస్తున్నారు. మిగతా కీలక ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ నుంచి ఈ జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఇక బౌలింగ్ విభాగంలో అక్షర్ పటేల్, నోర్ట్జీ వంటి వారు రాణిస్తున్నప్పటికీ.. ఇశాంత్ శర్మ ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. ఖలీల్ అహ్మద్ కూడా అలాగే పరుగులు ఇస్తున్నాడు. వీరిద్దరూ మెరుగ్గా బౌలింగ్ చేస్తే ఢిల్లీ జట్టుకు తిరుగు ఉండదు.

జట్ల బలాబలాలు చూస్తే లక్నో గెలిచే విధంగా కనిపిస్తోంది. సొంత మైదానం కావడం.. సక్సెస్ ట్రాక్ రికార్డు ఉండడంతో లక్నో వైపు గూగుల్ ప్రిడిక్షన్ మీటర్ టర్న్ చూపిస్తోంది. ఇదే సమయంలో ఢిల్లీ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదని చెబుతోంది.

జట్ల అంచనా

లక్నో

రాహుల్(కెప్టెన్), దేవ దత్ పడిక్కల్, క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, టర్నర్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కృణాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్.

ఢిల్లీ

రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వి షా, యశ్ దయాళ్, అభిషేక్ పోరెల్, స్ట బ్స్, కుశాగ్రా, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్.