సీఎం జగన్ కు ముద్రగడ లేఖ.. వెనకున్నదేవరు?

ఏపీలో కులం రాజకీయం మరోసారి ‘పసుపు’ రంగు పులుపుకుంటోంది. అభివృద్ధి చేసిన నాయకుల కంటే కులం పేరుతో ఓట్లు పొందే నాయకులే ఏపీలో ఎక్కువగా ఉన్నారు. ఏపీలో రెండు ప్రధాన పార్టీల మధ్య కుల రాజకీయాలు నడుస్తున్నాయి. టీడీపీ తొలి నుంచి ఏపీలో ఒక కులాన్ని బేస్ చేసుకునే రాజకీయాలను చేస్తుందనే నానుడి ఉంది. టీడీపీకి కాపు సామాజికవర్గం కొంత బలంగా ఉండగా వైసీపీ రెడ్ల నుంచి మద్దతు ఉంది. కిందటి ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్మోహన్ […]

Written By: Neelambaram, Updated On : July 4, 2020 3:20 pm
Follow us on


ఏపీలో కులం రాజకీయం మరోసారి ‘పసుపు’ రంగు పులుపుకుంటోంది. అభివృద్ధి చేసిన నాయకుల కంటే కులం పేరుతో ఓట్లు పొందే నాయకులే ఏపీలో ఎక్కువగా ఉన్నారు. ఏపీలో రెండు ప్రధాన పార్టీల మధ్య కుల రాజకీయాలు నడుస్తున్నాయి. టీడీపీ తొలి నుంచి ఏపీలో ఒక కులాన్ని బేస్ చేసుకునే రాజకీయాలను చేస్తుందనే నానుడి ఉంది. టీడీపీకి కాపు సామాజికవర్గం కొంత బలంగా ఉండగా వైసీపీ రెడ్ల నుంచి మద్దతు ఉంది. కిందటి ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హవా కొనసాగడంతో కాపులంతా కూడా ఆయనకే మద్దతు పలికారు. దీంతో వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 151 సీట్లతో తిరుగులేని ఆధిక్యాన్ని చాటింది.

చంద్రబాబు గుడులను కూడా వదల్లేదుగా..!

ఏపీ సీఎంగా జగన్మోహన్ ఏడాది పాలన ఇటీవల పూర్తయింది. అనేక సంక్షేమ పథకాలతో అన్నివర్గాల ప్రజలకు దగ్గరవుతున్నారు. కిందటి ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చిన కాపులను ఆదుకునేందుకు ఇటీవలే ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి రూ.15వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75వేల ఆర్థికసాయం చేయనున్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45నుంచి 60ఏళ్ల మధ్య వయసున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. తొలి ఏడాది దాదాపు 2.36లక్షల మహిళలకు లబ్ధి చేకూరనుంది.

వైసీపీ కాపునేస్తం అమలు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాన్ కాపు రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్ గా అధికార పార్టీ నేతలు సైతం దీటుగా జవాబిచ్చారు. కాగా గత ఎన్నికల్లో జనసేనకు వచ్చిన 6శాతం ఓట్లలో కాపువర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పవన్ కల్యాణ్ తెరపైకి కాపు రిజర్వేషన్ అంశాన్ని తెచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ విన్పిస్తుంది. పవన్ కు వత్తాసుగా టీడీపీ నాయకులు వంతపాడుతుండటంతో ఏపీ రాజకీయాల్లో కాపు రిజర్వేషన్ అంశం హాట్ టాపిక్ గా మారింది. గత టీడీపీ హయంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో ముద్రగడ కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తే నాటి టీడీపీ ప్రభుత్వ ఉక్కుపాదంతో అణిచివేసింది. దీంతో కొన్నిరోజులపాటు ముద్రగడ పద్మనాభం సైలంటయ్యారు.

ఇదీ చంద్రబాబు, దేవినేని ఉమ ఘనకార్యమట?

తాజాగా కాపు రిజర్వేషన్లపై ఏపీలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ కు  లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించకుండా కాపు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించారు. అడిగిన వారికి, అడగని వారికి అందరికీ దానాలుచేసి దానకర్ణుడుగా  వరాలిస్తున్న సీఎం జగన్ కాపు రిజర్వేషన్లను సాధించే విషయంలో ఎందుకు సహకరించడంలేదని ప్రస్తావించారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడానికి కాపు జాతి మద్దతు చాలా ఉందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. కాపు రిజర్వేషన్ అంశం సరైనదేనని గతంలో జగన్ చెప్పారని ముద్రగడ గుర్తు చేశారు. దివంగత రాజశేఖర్ రెడ్డి తరహాలోనే జగన్ కూడా అందరితో పూజలు అందుకోవాలని కోరారు. పదవిని మూన్నాళ్ళ ముచ్చటగా చేసుకోవద్దు అంటూ హెచ్చరించారు.

ఇన్నాళ్లూ స్తబ్ధుగా ఉన్న ముద్రగడ ఒక్కసారిగా జగన్ కు లేఖరాయడం వెనుక పలు అనుమానాలను లేవనెత్తతున్నాయి. కాపు నేస్తం పేరుతో వైసీపీ ప్రభుత్వం కాపులకు దగ్గరవుతుండగా పవన్ కల్యాన్ కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో తాను మౌనం వహిస్తే కాపు సామాజికవర్గం నుంచి వ్యతిరేకత వస్తుందని గ్రహించిన ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ కు లేఖ రాసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రిజర్వేషన్ల అంశంపై పవన్ కు క్రెడిట్ దక్కకుండా.. తన పరపతి పోకుండా ముద్రగడ ఇలా వ్యవహరించారనే వాదనలు విన్పిస్తున్నాయి. ఏదిఏమైనా కాపు రిజర్వేషన్ అంశం ఏపీ రాజకీయాలను మరోసారి హీటెక్కించడం ఖాయంగా కన్పిస్తోంది.