Balakrishna: ఆవేశం రీమేక్ లో బాలయ్య నటిస్తే ఎలా ఉంటుంది..? అసలు ఆ క్యారెక్టర్ లో మనం ఆయన్ని చూడగలమా..?

ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా బాలయ్య బాబు లాంటి హీరోకి మాత్రం చాలా మంచి క్రియేట్ ఉంటుందనే చెప్పాలి. నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు...

Written By: Gopi, Updated On : August 11, 2024 12:17 pm

Balakrishna

Follow us on

Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి ఉన్న గుర్తింపు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఆ క్యారెక్టర్ కి మంచి క్రేజ్ వస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు చాలా పాత్రల్లో నటించి ప్రేక్షకులందరిని మెప్పించాడు. ఇక మొత్తానికైతే బాలయ్య బాబు చేసిన ప్రతి పాత్ర కూడా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనను ఉన్నత స్థానాల్లో నిలబెట్టడంలో కూడా చాలావరకు హెల్ప్ అయ్యాయి. ఇక మొత్తానికైతే ఆయన పౌరాణికం, జానపదం లాంటి సినిమాలను కూడా చేసి తన తోటి జనరేషన్ లో ఉన్న హీరోలేవ్వరికీ సాధ్యం కానీ రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్య బాబు ఒక మలయాళం రీమేక్ సినిమాలో నటించబోతున్నాడు అంటూ చాలా వార్తలైతే వస్తున్నాయి. ‘ఫహాద్ ఫాజిల్ ‘ లీడ్ రోల్ లో నటించిన ‘ఆవేశం ‘ అనే సినిమా మలయాళం లో మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ సినిమా ప్రస్తుతం ఓటిటి లో అవలేబుల్ లో ఉంది.

అయితే ఈ సినిమాని బాలయ్య బాబుతో చేయాలబే ఉద్దేశ్యంతో కొంతమంది ప్రొడ్యూసర్స్ ఈ సినిమా రైట్స్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం హరీష్ శంకర్ డైరెక్షన్ లో బాలయ్య బాబు ఈ సినిమాను చేస్తాడు అంటూ పలు రకాల వార్తలైతే వెలువడుతున్నాయి. కానీ బాలయ్య బాబు ఈ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా లేదా అనే విషయం మీద చాలా రకాల కథనాలు అయితే వస్తున్నాయి.

ఇక నిజానికి బాలయ్య బాబు ఈ రీమేక్ చేయకపోతేనే బెటర్ అని కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్ గా వ్యవహరిస్తూ, వెకిలి క్యారెక్టర్ లో కనిపిస్తూ ఉంటాడు. అలా చేయడం ఆ నటుడికి అయితే చెల్లింది. కానీ బాలయ్య బాబు లాంటి ఒక స్టార్ డమ్ ఉన్న నటుడు అలాంటి పాత్రను పోషిస్తే అతని అభిమానులు చూడలేరు. కాబట్టి ఆ సినిమా ఫైనల్ గా దెబ్బ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి బాలయ్య బాబు ఆ పాత్రలో చేసి కంటే ఆ పాత్ర నుంచి విరమించుకుంటే మంచిది అంటూ కొంతమంది సినీ విమర్శకులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక మొత్తానికైతే బాలయ్య బాబు ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక మాస్ కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే వరుసగా నాలుగో సినిమాతో కూడా భారీ సక్సెస్ ని అందుకున్న హీరోగా గుర్తింపు పొందుతాడు… ఇక ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి తో కూడా మరొక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి…

Tags