Vande Bharat Sleeper : అత్యాధునిక సౌకర్యాలతో.. ప్రయాణికులను అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చాలన్న లక్ష్యంతో మేకిన్ ఇండియాలో భాగంగా భారత ప్రభుత్వం వందే భారత్ రైళ్లను తయారు చేయించింది. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ రైళ్లు ఇప్పటికే దేశమంతా పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు ఉండడంతో చార్జీ కాస్త ఎక్కువైనా ప్రయాణికులు ఇబ్బంది పడడం లేదు. దీంతో వందే భారత్ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే కొత్తగా వందే భారత్ స్లీపర్‌ను పట్టాలెక్కించబోతోంది. ఇప్పటి వరరకు వందే భారత్ రైళ్లు చైర్‌కార్‌లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటిని ఉదయం పూట నడుపుతున్నారు. అయితే స్లీపర్ సౌకర్యాలతో కూడిన రైళ్లను సిద్ధం చేస్తోంది. అందుకు అనుగుణంగా స్లీపర్ వెర్షన్‌ను అన్ని హంగులతో సిద్ధం చేస్తోంది. త్వరలో ట్రయల్ రన్ నిర్వహించి పట్టాలెక్కించబోతున్నారు.
త్వరలో పట్టాలపైకి..
ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వందేభారత్ స్లీపర్ వెర్షన్ త్వరలో పట్టాలెక్కబోతున్నాయి. ఇందుకు సంబంధించిన బోగీలు చెన్నై ఐసీఎఫ్(ఇండిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ)లో తుది మెరుగులు దిద్దుకుంటుఆన్నయి. ప్రయోగాత్మకంగా వీటిని ఇప్పటికే మీడియాకు ప్రదర్శించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏకధాటిగా 1,200 కిలోమీటర్లు ప్రయాణించేందుకు అవసరమైన సౌకర్యలతో రూపొందించారు. ఇది గరిస్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగవంతో ప్రయాణిస్తుంది.
బోగీల్లో ఈ సౌకర్యాలు..
ఇక బోగీల్లో అత్యధునిక సౌకర్యాలు కల్పించారు. మొబైల్ చార్జింగ్, మేగజైన్లు,. టేబుల్, ఇన్నపాటి లైట్, సామగ్రి కోసం విశాలమైన స్థలం, వేడినీరు, సీసీ కెమెరాలు, అత్యవసర సమయాల్లో డ్రైవర్‌తో మాట్లాడే సౌకర్యం, బయో వాక్యుమ్ టాయిలెట్‌లు ఏర్పాటు చేశారు. 2025, జనవరిలో వీటిని పట్టాలెక్కించేందుకు ఇండియన్ రైల్వే సన్నాహాలు చేస్తోంది.
ట్రయల్ రన్ పూర్తి..
వందే భారత్ స్లీపర్ వెర్షన్ ట్రయల్ రన్ ఇప్పటికే ప్రారంభమైంది. నవంబర్ 15 నుంచి ట్రయల్‌రల్ చేస్తున్నారు. ట్రయల్స్ పూర్తి కాగానే జనవరి 15 నుంచి పట్టాలపై పరుగులు పెడుతుంది. ఇక వాణిజ్య రైళ్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు భారత రైల్వే కసరత్తు చేస్తోంది. కేంద్రం అనుమతి ఇస్తే ఫిబ్రవరి నాటికి కమర్షియల్ రైళ్లను కూడా సిద్ధం చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Indian railways to roll out new vande bharat sleeper in january
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com