Indian Railway: ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇక ఎక్కడి నుంచైనా జనరల్‌ టికెట్‌

తాజాగా రైల్వేశాఖ యూటీఎస్‌ యాప్‌లో మార్పులు చేసింది. ప్లాట్‌ఫామ్‌కు ఎంత దూరంలో ఉన్నా.. టికెట్‌ పొందేలా యాప్‌ను అప్‌డేట్‌ చేశారు. దీంతో ఇక ఇంట్లో నుంచి కూడా జనరల్‌ టికెట్‌ బుక్‌ చేసుకునే వీలు ఉంది.

Written By: Raj Shekar, Updated On : April 26, 2024 4:24 pm

Indian Railway

Follow us on

Indian Railway: రైలు ప్రయాణం చేయాలనుకున్నపుడు జనరల్‌ టికెట్‌ దొరకడం చాలా కష్టం. టికెట్‌ కౌంటర్ల వద్ద క్యూలో ఉండగానే రైలు ప్లాట్‌ఫాంపైకి వచ్చి వెళ్లిపోయిన ఘటనలూ ఎదురవుతున్నాయి. ట్రెయిన్‌ మిస్‌ అవుతుందని టికెట్‌ లేకుండా ఎక్కి.. టీటీకి దొరికిన సందర్భాలూ ఉన్నాయి. ప్రధానంగా సెలవులు, పండుగల వేళల్లో జనరల్‌ టికెట్ల కోసం బుకింగ్‌ కౌంటర్లలో యుద్ధం చేయాల్సిన పరిస్థితి.

యాప్‌తో పరిష్కారం..
ఈ సమస్యకు పరిష్కారంగా ఇండియన్‌ రైల్వే యూటీఎస్‌ (అన్‌ రిజర్వుడ్‌ టికెటింగ్‌ సిస్టమ్‌) యాప్‌ను గతంలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు క్యూలో నిలుచోకుండా ఈ యాప్‌ ద్వారా జనరల్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్‌ స్టేష¯Œ కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. దీంతో ప్రయాణికులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు రైల్వేశాఖ గుర్తించింది.

కొత్త అప్‌డేట్‌..
తాజాగా రైల్వేశాఖ యూటీఎస్‌ యాప్‌లో మార్పులు చేసింది. ప్లాట్‌ఫామ్‌కు ఎంత దూరంలో ఉన్నా.. టికెట్‌ పొందేలా యాప్‌ను అప్‌డేట్‌ చేశారు. దీంతో ఇక ఇంట్లో నుంచి కూడా జనరల్‌ టికెట్‌ బుక్‌ చేసుకునే వీలు ఉంది. ముందే టికెట్‌ బుక్‌ చేసుకుని రైల్వే స్టేషన్‌కు వస్తే సరిపోతుంది. అయితే ఒక్కటి గుర్తుంచుకోవాలి. సరిగ్గా రైలు ప్లాట్‌ఫామ్‌పైకి రాబోతుందనే సమయానికి అంటే ప్లాట్‌పామ్‌కు 50 మీటర్లు దూరంలో ఉన్నపుడు మాత్రం ఈ యాప్‌ పనిచేయదు.