Sleeping: సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం ఎంతో ముఖ్యం. హెల్త్ సరిగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలం. అందుకే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని వైద్యారోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం చిన్న చిన్న టిప్స్ ను పాటించడం వలన లైఫ్ మరింత ఆనందంగా ఉంటుందని చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి ప్రధానంగా ఉండాల్సింది నిద్ర. సుఖమైన నిద్ర వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
అయితే కొన్ని చిట్కాలను పాటించడం వలన శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా, ప్రశాంతను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. నగ్నంగా పడుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటున్నాయని తెలియజేస్తున్నారు. నార్మల్ గా ఆరోగ్యకరమైన జీవనానికి నిద్ర ఎంతో అవసరం. నగ్నంగా పడుకోవడం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని, దీని వలన గాఢమైన నిద్రలోకి వెళ్లిపోతారట. అలాగే తీవ్రమైన ఒత్తిడి, మానసిక అలసట కూడా తగ్గుతుందని తెలియజేస్తున్నారు.
రాత్రి సమయాల్లో నగ్నంగా నిద్రించడం వలన భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుందని నిపుణులు తెలిపారు. ఒకరినొకరు తాకడం వలన ప్రత్యేకమైన హార్మోన్లు విడుదల అవుతాయి. వీటి వలన శారీరక అలసట తొలగడమే కాకుండా ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ చెక్కుచెదరకుండా ఉంటుంది. దీని వలన వివాహ బంధం మధురంగా మారుతుంది. ఈ విధంగా నిద్రించే జంటల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని తెలిసింది. అదేవిధంగా రాత్రంతా బట్టలు లేకుండా పడుకోవడం వలన లైంగిక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
అందుకే ఒంటపై నూలు పోగు లేకుండా నిద్రిస్తే ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. చర్మం కూడా ఆరోగ్యంగా మారుతుందని, చర్మ సంబంధిత వ్యాధులు నయం అవుతాయని పేర్కొంటున్నారు. బట్టలు లేకుంటే రక్త ప్రసరణ సాఫీగా సాగి స్కిన్ మెరుపును పెంపొందిస్తుంది. అలాగే శరీర ఉష్ణోగ్రత తగ్గి మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీని వలన చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. అంతేకాదు బట్టలు లేకుండా నిద్రించడం వలన గుండె సంబంధిత వ్యాధులు దూరం అవుతాయట.