Presidential Election: రాష్ట్రపతి ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల మాదిరిగా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా… లేక ముందస్తుగానే అభ్యర్థిగా ప్రకటిస్తుందా అన్న చర్చ మొదలైంది. గతసారి బిహార్ గవర్నర్ గా ఉన్న దళిత నేత రామ్‌నాథ్ కోవింద్‌ను తెరపైకి తెచ్చి రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. ఈసారి అటువంటి వ్యూహంతోనే ముందుకెళుతున్నట్టు తెలుస్తోంది.రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంలో అధికార బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ కూటమి మద్దతిచ్చిన అభ్యర్థే విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంఖ్యాబలం దానికే అనుకూలంగా ఉంది. ఎలక్టొరల్ కాలేజీ ఓట్లలో 50%కు పైగా సాధించాలంటే మరో 1.2% ఓట్లు తమకు అవసరమని.. ఆంధ్రప్రదేశ్, ఒడిస్సాలోని పాలక పక్షాలైన వైసీపీ, బీజేడీ, తమిళనాడులోని ప్రతిపక్షం అన్నాడీఎంకే మద్దతుతో అవలీలగా విజయం సాధించగలమని బీజేపీ అగ్ర నాయకత్వం ధీమాగా ఉంది. ఇంకోవైపు గెలిచే అవకాశా లు తక్కువగానే ఉన్నా.. ప్రతిపక్షాలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని యోచిస్తున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో 776 మంది ఎంపీలకు గాను ఎన్‌డీఏకి 440 మంది సభ్యులున్నారు. యూపీఏకి 180 మంది, మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి 36 మంది ఎంపీలున్నారు. టీఎంసీ సహజంగా ప్రతిపక్ష అభ్యర్థికే ఓటేస్తుంది. శుక్రవారం జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మరో చెరో 6 సీట్లు గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ మిత్రపక్షాలు ఇంకో 3 గెలుచుకోనున్నాయి.

ఐదు రాష్ట్రాల విజయంతో..
మొన్నటివరకూ బీజేపీ రాష్ట్రపతి ఎన్నికలకు అవసరమైన ఓటింగ్ శాతానికి దూరంగా ఉండేది. ఇటీవల అది దగ్గరగా మారింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద రాష్ట్రమైన యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ల్లో బీజేపీ విజ యం సాధించింది (పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నెగ్గింది). తద్వారా ఎలక్టొరల్ కాలేజీ ఓట్లు పెంచుకుంది. ప్రస్తుత బలాబలాలు చూస్తే మొత్తం 10,86,431 ఎలక్టొరల్ ఓట్లకు గాను ఎన్‌డీఏకి 5,35,000 ఓట్లు ఖాయంగా వస్తాయి. వైసీపీ, బీజేడీ, అన్నాడీఎంకే ఓట్లు అద నం. ఇక రాష్ట్రాల విషయానికొస్తే యూపీలో బీజేపీకి 273 మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ రాష్ట్రంలో గరిష్ఠంగా 56,784 ఓట్లు దానికి వస్తా యి. బిహార్‌లో బీజేపీ, దాని మిత్రపక్షాలైన జేడీయూ, ఇతరులకు కలిపి 127 మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ రాష్ట్రంలో 21,971 ఓట్లు వస్తాయి. మహారాష్ట్రలో అధికారంలో లేకున్నా బీజేపీ అతిపెద్ద పార్టీ గా ఉంది. 288 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల ద్వారా 18,375 ఓట్లు దక్కుతాయి. మధ్యప్రదేశ్‌లో 17,161, గుజరాత్‌లో 15,982 ఓట్లు వస్తాయి. ఇక యూపీఏకి ఎంపీల ద్వారా లక్షన్నర ఓట్లు దక్కనున్నాయి. రాష్ట్రాల్లోనూ అంతే సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. గతంలో ప్రతిపక్ష అభ్యర్థులు కూడా 3 లక్షలకు పైగా ఓట్లు సాధించారు. యూపీలో బీజేపీ మెజారిటీ తగ్గినా.. ఎన్‌డీఏకి శివసేన, అకాలీదళ్ దూరమైనా.. ఇవేవీ బీజేపీని విజయానికి దూరం చేయలేవని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Nayanthara: తిరుమలలో భద్రతా వైఫల్యం…శ్రీవారి ఆలయం ముందుకు చెప్పులతో వచ్చిన నయనతార
గత సారిలా అనూహ్యంగా..
గతసారి బిహార్ గవర్నర్‌గా ఉన్న దళిత నేత రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేసి అందరినీ విస్మయపరిచింది. ఆయన బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేసినా.. హిందూత్వకు దూరంగానే ఉన్నారు. ఇది దళితుల ఓట్లు పెద్దఎత్తున పొందడానికి ఆ తర్వాత కాషాయ పార్టీకి పలు ఎన్నికల్లో బాగా ఉపకరించింది. ఈసారీ ఇలాగే ఆశ్చర్యకరరీతిలో రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా అభ్యర్థిని ఎంపిక చేస్తుం దా.. లేక తన హిందూత్వ సిద్ధాంతాల ప్రాతిపదికన ఖరారుచేస్తుందా అనేది రాజకీయ పరిశీలకులకు కూడా అంతుపట్టడం లేదు. ఈ దఫా గిరిజన మహిళకు అవకాశమిస్తారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరు ఈ సందర్భంగా వినిపిస్తోంది. ఈమె ఒడిసాకు చెందిన బీజేపీ గిరిజన నేత. జార్ఖండ్ గవర్నర్‌గా 2015 మే 18 నుంచి 2021 జూలై 12 వరకు పనిచేశారు. రాష్ట్రపతిని చేసేందుకే ఆమెకు పొడిగింపు ఇవ్వలేదన్న ప్రచారం ఉంది. ఆమెను ఎంపిక చేస్తే గిరిజన కోటాతో పాటు మహిళలకూ అవకాశం ఇచ్చినట్లవుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కోవింద్‌కు రెండో అవకాశం ఇస్తారనీ ప్రచారం ఉంది. అయితే బాబూ రాజేంద్రప్రసాద్ తర్వాత ఏ రాష్ట్రపతీ రెండోసారి పోటీ చేయ లేదు.

ఏదేమైనా రాష్ట్రపతి పదవి ఎన్నికపై ఏకాభిప్రాయ సాధనకు తమ సీనియర్ నేతలు వివిధ ప్రతిపక్షాలను సంప్రదిస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. తమకు బలం లేకపోయినా.. కాషాయ పార్టీకి వాకోవర్ ఇవ్వకూడదని కొన్ని విపక్షాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. అందుకే ఉమ్మడి అభ్యర్థిని నిలపడంపై మంతనాలు సాగిస్తున్నాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత (కాంగ్రెస్) మల్లికార్జున్ ఖర్గే ఈ దిశగా తనతో మాట్లాడినట్లు సీపీఐ ఎంపీ బినయ్ బిశ్వం ట్విటర్‌లో తెలిపారు. లౌకిక, ప్రగతిశీల భావాలు కలిగిన ఉమ్మడి అభ్యర్థిని నిలిపితే మద్దతిస్తామని తాను చెప్పినట్లు తెలిపారు. సమాజ్‌వాదీతోపాటు ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా విపక్ష అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
[…] Also Read: Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో విజయా… […]
[…] Also Read: Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో విజయా… […]