Nayanthara: చుక్కలాంటి అమ్మాయి నయనతార, చక్కనైన అబ్బాయి విఘ్నేశ్ శివన్.. ఇద్దరొక్కటయ్యారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట శ్రీవారి దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత విఘ్నేశ్ దంపతుల ఫొటో షూట్ నిర్వహించారు. భక్తులు ఎగబడ్డారు. ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అంతవరకూ బాగానే ఉంది కానీ.. అక్కడే ఒక తిరకాసు వెలుగుచూసింది. నిఘా వైఫల్యం బట్టబయలైంది. శ్రీవారి ఆలయం ముందుకు చెప్పులతో నయనతార వచ్చింది. చెప్పులతో వచ్చిన ఆమెను భద్రతా సిబ్బంది గమనించలేక పోవడం గమనార్హం. నయనతారను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. కొందరు అభిమానులు ఈ జంటతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో వారిని అక్కడి నుంచి నయనతార బాడీగార్డ్స్ పంపేశారు. ఫొటో షూట్ జరుగుతున్నంత సేపు ఆలయం దగ్గర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఫొటో షూట్ జరుగుతున్నా భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. నయనతార జంటకు రక్షణగా వచ్చి భద్రతా సిబ్బంది కారు ఎక్కించారు.

దక్షిణాది సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విఘ్నేశ్, నయనతార వివాహం గురువారం ఉదయం చెన్నై సమీపంలోని మహాబలిపురం వడనెమ్మేలిలోని షెరటాన్ గ్రాండ్ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది. చిత్రసీమకు చెందిన అనేకమంది ప్రముఖులు తరలి వచ్చి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. 2015లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ‘నానుమ్ రౌడీదాన్’ చిత్రంలో నయనతార నటించారు.
Also Read: Pooja Hegde: పూజాహెగ్డేను విమానంలో అలా చేశారట.. ట్వీట్ కలకలం

ఆ సమయంలో విఘ్నేష్, నయన్‌ల మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్లుగా కలిసే ఉంటున్నారు. వీరిద్దరి గురించి మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టేవి. అయితే వాటి గురించి మాట్లాడేందుకు ఇద్దరూ ఇష్టపడేవారు కాదు. ఓ గుళ్లో రహస్యంగా పెళ్లి చేసేసుకొన్నారని కూడా చెప్పుకొనేవారు. అప్పుడు కూడా ఈ జంట మౌనంగానే ఉంది. అయితే కొంతకాలంగా పెళ్ళి చేసుకోవాలంటూ నయనతారపై కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకురావడంతో ఈ ప్రేమికులిద్దరూ ఓ ఇంటివారు కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.
మరోవైపు నవదంపతులు విఘ్నేశ్, నయనతారలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా లక్షమంది అనాధ పిల్లలకు ఉచ్చితంగా కడుపునిండా భోజనం పెట్టించారు అట..పెళ్లి రోజు నాడు హంగులు ఆర్భాటాలు చెయ్యడం మాత్రమే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు కూడా చెయ్యడం నిజంగా చాలా గ్రేట్ అంటూ సోషల్ మీడియా లో ఈ జంట పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Also Read:Prabhas Marriage: శ్రావణమాసంలో ప్రభాస్ పెళ్లి… అమ్మాయి ఎవరంటే?
[…] […]
[…] […]