Homeజాతీయ వార్తలుIndian Economy: ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎలా ఎదగగలిగింది?

Indian Economy: ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎలా ఎదగగలిగింది?

Indian Economy: ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక రంగంలో తనదైన ముద్ర వేస్తోంది. 140 కోట్లకు పైగా జనాభాతో అపారమైన మానవ వనరులతో బలమైన దేశీయ డిమాండ్‌తో ఇండియా దూసుకుపోతుంది. తాజాగా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో జపాన్‌ను అధిగమించడం ఒక ముఖ్యమైన మైలురాయి. కేవలం రెండున్నర నుంచి మూడేళ్లలో జర్మనీని కూడా దాటి మూడో స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్ ఈ స్థాయికి చేరుకోవడానికి అనేక కారణాలు దోహదపడ్డాయనే చెప్పాలి. నీతి ఆయోగ్ సీఈఓ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం ఇటీవల నీతి ఆయోగ్ సమావేశంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) గణాంకాలను తెలుపుతూ.. భారతదేశం 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని స్పష్టం చేశారు. ఈ అనూహ్య వృద్ధికి దోహదపడ్డ కొన్ని కీలక అంశాల గురించి తెలుసుకుందాం.

బలమైన దేశీయ వినియోగం (Strong Domestic Consumption): భారతదేశంలో భారీ జనాభా ఉండడం వల్ల దేశీయంగా వస్తువులు, సేవల వినియోగం గణనీయంగా పెరిగింది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఒక స్థిరమైన పునాదిని అందించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుదల ఆర్థిక వృద్ధికి దోహదపడింది.

ప్రభుత్వ పెట్టుబడులు, సంస్కరణలు (Government Investments and Reforms): మౌలిక సదుపాయాల కల్పన (రోడ్లు, పోర్టులు, విద్యుత్), డిజిటల్ ఇండియా వంటి పథకాలలో ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టింది. GST, దివాలా కోడ్ (Insolvency and Bankruptcy Code) వంటి సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. వ్యాపారం చేయడానికి సులువుగా ఉండే వాతావరణాన్ని కల్పించాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమాలు దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించాయి.

సేవల రంగం వృద్ధి (Growth in Services Sector): ఐటీ, సాఫ్ట్‌వేర్ సేవలు వంటి వాటిలో భారత్ ఈ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. సేవల రంగం జీడీపీలో సింహభాగాన్ని కలిగి ఉంది. స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది.

తగ్గుతున్న ద్రవ్యోల్బణం, స్థిరమైన ఆర్థిక విధానాలు (Lower Inflation and Stable Economic Policies): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి తీసుకున్న చర్యలు, ప్రభుత్వ ఆర్థిక విధానాలు స్థిరత్వాన్ని అందించాయి. ఇది పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించింది.

గ్లోబల్ సప్లై చైన్ డైవర్సిఫికేషన్ (Global Supply Chain Diversification): చైనా మీద ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న ప్రపంచ కంపెనీలు, భారతదేశాన్ని ఒక ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా చూస్తున్నాయి. ముఖ్యంగా ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు భారతదేశంలో తమ ఉత్పత్తిని పెంచాలని చూస్తున్నాయి. నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం చెప్పినట్లు.. డోనాల్డ్ ట్రంప్ వంటి వారు ఆపిల్ ఫోన్ల తయారీ అమెరికాలోనే జరగాలని డిమాడ్ చేస్తున్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారతదేశం ఆపిల్ ఫోన్లను మరింత చౌకగా తయారు చేయగల దేశంగా భారత్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇది భారతదేశానికి పెద్ద సానుకూల అంశం.

ఆస్తుల నగదు రూపంలోకి మార్చడం (Asset Monetization): రెండో విడత అసెట్ మానిటైజేషన్ పైప్‌లైన్‌ను సిద్ధం చేస్తున్నట్లు.. దీనిని ఆగస్టులో ప్రకటిస్తామని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇది ప్రభుత్వానికి మరింత ఆదాయాన్ని సమకూర్చి, పెట్టుబడులకు దోహదపడుతుంది.

వికసిత్ భారత్ 2047
ప్రస్తుతం ఈ ప్రపంచంలో టాప్ త్రీ ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా, జర్మనీ ఉన్నాయి. 2047 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ప్రధాని మోదీ చెబుతూ వస్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాలను వివరించారు. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి తయారీ రంగం (manufacturing), మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల అభివృద్ధి, పరిశోధన అభివృద్ధి (R&D) వంటి రంగాలపై మరింత దృష్టి పెట్టడం అవసరం.భారతదేశం కేవలం ఆర్థికంగానే కాకుండా ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని కూడా పెంచుకుంటోంది. ‘విశ్వగురు’గా మారాలన్న లక్ష్యం, ఆర్థిక బలోపేతంతో మరింత సాధ్యమవుతుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version