Do Raaste: కొన్నిసార్లు హిట్ అవుతున్నాయి అనుకున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకోకుండా పరాజయం పొందుతాయి. అలాగే మరికొన్నిసార్లు ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు ఊహించని విధంగా ఇండస్ట్రీ హిట్స్ అవుతాయి. ప్రతివారం కూడా థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తూ ఉంటాయి. ప్రేక్షకులు కూడా పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. చిన్న బడ్జెట్ సినిమాలు అయిన కూడా కంటెంట్ బాగుంటే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధిస్తాయి. కథ బలంగా ఉంటే ఆ సినిమాను హిట్ అవ్వకుండా ఎవరు ఆపలేరు. ఇందుకు ఉదాహరణగా ఇప్పటివరకు చాలా సినిమాలు ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్స్ గా కూడా నిలిచాయి. నిర్మాతలు కూడా కంటెంట్ బాగుంటే బడ్జెట్ విషయంలో తగ్గేదేలె అంటున్నారు. ఎంత బడ్జెట్ అయిన కూడా పెట్టి సినిమాలు చేయడానికి నిర్మాతలు ఓకే అంటున్నారు. కొన్ని సినిమాలు అనుకున్న విధంగానే భారీ విజయాలు సాధించే నిర్మాతలకు లాభాలు కూడా తెచ్చి పెడతాయి.
కానీ మరి కొన్ని మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడి నిర్మాతలకు నష్టాన్ని మిగిలిస్తాయి. కానీ అప్పట్లో ఒక నిర్మాత తన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతుంది అని భావించి బోరున ఏడ్చేసాడు. కానీ ఆ సినిమా ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఊహించని సంఘటనలు కూడా చాలానే జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుందని నిర్మాత అనుకున్నాడు. కానీ థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఊహించని విధంగా సంచలన విజయం అందుకుంది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఏకంగా 400 రోజులు థియేటర్లలో ప్రదర్శించబడి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా పేరు దో రాస్తే.
రాజ్ ఖోస్లా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజేష్ ఖన్నా తో పాటు ముంతాజ్, బల్రాజ్ సాహ్ని, ప్రేమ్ చోప్రా వంటి నటులు కీలక పాత్రలలో కనిపించారు. కుటుంబ విలువలు మరియు ప్రేమ బాధ్యతలు, త్యాగం వంటి ఇతివృత్యాల చెట్టు ఈ సినిమా కథ ఉంటుంది. అప్పట్లో ఈ సినిమా బాంబేలో రాయల్ ఒపేరా హౌస్ లో ప్రదర్శించినప్పుడు దీనికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దాంతో ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అని భావించి ఆ సమయంలో నిర్మాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే రాజేష్ కన్నా నటించిన మరొక సినిమా ఆరాధన థియేటర్లలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. ఆ థియేటర్ మేనేజరు దొ రాస్తే సినిమా ఫ్లాప్ అవుతుందని మహేష్ భట్, బోన్స్ లే తో చెప్పడం జరిగింది. దాంతో నిర్మాత మహేష్ భట్ ఈ సినిమా ప్లాప్ అవుతుందని కన్నీళ్లు పెట్టుకున్నారట.