Kuno National Park Cheetah: సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం తన జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ అడవులలో చీతాలను వదిలారు. అప్పట్లో దీనిపై కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా రచ్చ రచ్చ చేసింది. చివరికి జంతువులను కూడా నరేంద్ర మోడీ తన రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మండిపడింది. అంతేకాదు నమీబియా ప్రాంతం నుంచి చీతాలను తీసుకురావాలనేది తమ నిర్ణయమని ప్రకటించింది. అయితే ఎందుకు తీసుకురాలేకపోయారు అనే ప్రశ్నకు మాత్రం కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పలేకపోయింది.
నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ అడవుల్లో చీతాలను వదిలిపెట్టిన తర్వాత.. అవి ఇక్కడి వాతావరణానికి తట్టుకోలేక కొన్ని కన్నుమూసాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. రాజకీయంగా జంతువులను వాడుకోవాలని చూస్తే చివరికి వాటికి ఈ గతి పట్టిందని కాంగ్రెస్ పార్టీ శోకాలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు బిజెపి దగ్గర సమాధానం లేకుండా పోయింది. అయితే ఇన్నాళ్లకు బిజెపి నాయకులకు ఒక అస్త్రం దొరికింది. దానిని కాస్త కాంగ్రెస్ నాయకుల మీదికి ప్రయోగించడానికి బిజెపి రెడీగా ఉంది. చీతాలను వదిలిన ఇన్ని రోజులకు ఎందుకు బిజెపికి అస్త్రం దొరికింది? సోషల్ మీడియాలో ఎందుకు ఈ స్థాయిలో ప్రచారం మొదలు పెట్టింది? కాంగ్రెస్ సోషల్ మీడియా ఎందుకు సైలెంట్ గా ఉంటోంది? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
మనదేశంలో చీతాలను పునరుద్ధరించడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఈ ప్రయత్నాలకు బలమైన బీజం పడింది.. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా సౌత్ ఆఫ్రికా, నమీబియా నుంచి కొన్ని చీతాలను తీసుకొచ్చారు. ఇందులో సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ అడవుల్లో వదిలిపెట్టారు. అయితే ఇందులో ముఖి అనే చీతా తాజాగా ఐదు కూనలకు జన్మనిచ్చింది. ఫలితంగా భారత్ లో జన్మించి.. సంతాన ఉత్పత్తి చేసిన మొట్టమొదటి చీతాగా ఇది నిలిచింది. మనదేశంలో వన్యప్రాణి సంరక్షణ ప్రయత్నాలకు ఇది గొప్ప ప్రోత్సాహంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర పర్యావరణ శాఖ సోషల్ మీడియాలో పంచుకుంది.. మధ్యప్రదేశ్లో మొదట్లో చీతాలు ఇబ్బంది పడేవి. ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక కొన్ని చనిపోయాయి. అయితే వీటి మనుగడ కోసం పర్యావరణ శాఖ అనేక రకాలుగా ఏర్పాట్లు చేయడంతో చివరికి పునరుత్పాదక శక్తిని పెంపొందించుకున్నాయి. అంతేకాదు సంతానోత్పత్తిని కూడా మొదలుపెట్టాయి. ఐదు కూనలు ఆరోగ్యంగా ఉన్నాయని.. తల్లిపాలు తాగుతున్నాయని.. చలాకీగా కదులుతున్నాయని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఇది లక్షలాది వీక్షణలను సొంతం చేసుకుంది.
When the project Chertah began and a few cheetahs didn’t survive acclimatisation, the usual critics rushed to call it its a @narendramodi ji photo-op
But conservation is a long, scientific process ,not a headline show.
Today’s successful India-born litter proves that the… pic.twitter.com/3NG2EMcfX9— Indrajeet Singh (@DCIOPMO) November 20, 2025