Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం శుక్రవారం ద్వాదశ రాశులపై జేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారి ఆదాయానికి డోకా ఉండదు. మరికొన్ని రాశుల వారు అనుకున్న పలితాలను పొందుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామి నుంచి పూర్తిగా మద్దతు ఉంటుంది. దీంతో డబ్బు సంపాదనకు డోకా ఉండదు. వీరి డబ్బు సంపాదనకు మిగతావారు పోటీ రారు. ఉద్యోగులు పక్కవారిని దాటేసుకుంటూ అత్యంత స్థాయికి ఎదుగుతారు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఇదే మంచి సమయం.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు విషయంలో ఎవరితోనూ వాదనలకు దిగకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య సంయమనం ఉండడంతో ప్రయోజనాలు ఉంటాయి. జీవిత భాగస్వామి కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి కొన్ని శుభవార్తలు అందుతాయి. వీరు ఈరోజు ఏ పని మొదలుపెట్టినా పూర్తి చేయగలుగుతారు. అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో ప్రజల్లో మద్దతు పెరుగుతుంది. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణ ఉంటుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందుతాయి. సౌకర్యాల కోసం ప్రత్యేకంగా డబ్బులు వస్తాయి. అయితే దుబారా ఖర్చులను నియంత్రించాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొత్తగా పనులు ప్రారంభించే వారికి ఇదే మంచి సమయం. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఒత్తిడి ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులతో కొత్తగా ప్రాజెక్టును ప్రారంభిస్తారు. విభేదాలు ఉంటే తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తల వింటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులు కొత్తవారితో జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా పనులు ప్రారంభించేముందు పెద్దలను సంప్రదించడం మంచిది. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. దీంతో వీరికి ఊహించని దానికంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి. స్నేహితుల మధ్య హృదయపూర్వక సంబంధాలు పెరిగిపోతాయి. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. బంధువుల నుంచి కీలకమైన సమాచారం అందుతుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : వ్యాపారులు చేసే కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అయితే భాగస్వాముల మధ్య విభేదాలు ఏర్పడడంతో సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారులు అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన విభేదాలు మానసిక ప్రశాంతిని కలిగిస్తాయి. తండ్రి సలహాతో కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. బంధువులతో వ్యాపారం చేసేవారు శుభవార్తలు వింటారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకునేవారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మీరు రాశి వారికి ఈ రోజు అధికంగా ఖర్చులు ఉంటాయి. కొత్తగా వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉండదు. సాయంత్రం తల్లిదండ్రులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ పనులలో పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా ఆదాయ వనరులను పొందుతారు. అకస్మాత్తుగా వ్యాపార పర్యటనలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏమైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు తెలివితేటలతో తమ కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. దీంతో కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే వారికి అనుకూలమైన వాతావరణ ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది.