5G Network: ఒకప్పుడు మనుషులు మాట్లాడుకోవాలంటే ల్యాండ్ లైన్ ఫోన్లు ఉండేవి. ఆ తర్వాత అనేక మార్పులు చెందిన తర్వాత ఫోన్ రూపం మారిపోయింది. చేతుల్లో పట్టుకునే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఒక టచ్ దూరంలోనే సమస్తాన్ని అరచేతిలో ఉంచుతోంది. మాటల నుంచి మొదలుపెడితే పాటల వరకు.. తినే తిండి నుంచి మొదలుపెడితే చూసే సినిమా వరకు ఇలా సమస్తం మొత్తం ఫోన్ లోనే. ఫోన్ ద్వారానే..
మొదట్లో ఒకటో తరం టెక్నాలజీ అందుబాటులో ఉండేది. ఆ తర్వాత రెండవ తరానికి, అనంతరం మూడవ తరానికి, కొంతకాలానికి నాలుగవ తరానికి.. ఇప్పుడు ఐదవ తరానికి కనెక్టివిటీ పెరిగిపోయింది. భవిష్యత్తు కాలంలో ఆరవతరం సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. అయితే ఇప్పుడైతే ఐదవ తరం సేవలు సెల్ ఫోన్ రంగాన్ని ఊపేస్తున్నాయి. వాస్తవానికి 5g మొదలైన నాటి నుంచి ఆ సేవలను పొందడానికి వినియోదారులు విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నారు.. 2031 నాటికి మనదేశంలో 5 జీ సబ్ స్క్రిప్షన్లు 100 కోట్లు దాటుతాయని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకటించింది. 2031 వరకు మొబైల్ సబ్స్క్రిప్షన్లలో 79% 5 జీకి మారిపోతాయని ఆ సంస్థ ప్రకటించింది.
ఈ ఏడాది చివరి నాటికి 394 మిలియన్లకు సబ్ స్క్రిప్షన్లు చేరుకుంటాయని ఎరిక్సన్ మొబిలిటీ సంస్థ ప్రకటించింది. మొత్తం సబ్ స్క్రిప్షన్ల సంఖ్యలో ఇది 32 శాతం మంది తెలుస్తోంది. మనదేశంలో మొబైల్ డేటా వినియోగం విపరీతంగా పెరగడం.. నెట్వర్క్ విస్తరణ ఎక్కువ కావడం వల్ల 5జీ సేవలలో రాకెట్ వేగం కనిపిస్తోందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు 5జీ ఫోన్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 2031 నాటికి 100 కోట్ల 5జి సబ్ స్క్రిప్షన్లు నమోదవుతాయంటే ఇది మామూలు విషయం కాదని టెక్ నిపుణులు చెబుతున్నారు. వచ్చే కాలం మొత్తం, ఆపై వచ్చే కాలం కూడా మొత్తం 5జీ దేనని వ్యాఖ్యానిస్తున్నారు.
మొబైల్ వినియోగం పెరిగిపోవడం.. వినియోగదారులు వేగాన్ని కోరుకోవడం.. వీడియోలు, మాటలు, పాటలు, నెట్వర్క్ స్పీడ్, నాణ్యత.. వీటిలో వినియోగదారులు ఏమాత్రం రాజీ పడటం లేదు. అందువల్లే ఐదవతరం టెక్నాలజీ వాళ్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీనికి తోడు టెక్నాలజీ అనేది నిత్యవసరం కావడంతో చాలామంది ఐదవ తరం సేవల వైపు ఆసక్తి చూపిస్తున్నారని ఆనేక కథనాలు తెలియజేస్తున్నాయి.