Indian Army Drones: పహల్గాం ఉగ్రదాడి.. 26 మంది యాత్రీకుల కాల్చివేత.. తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో మన సైనిక శక్తి పాకిస్తాన్‌తోపాటు ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది. భారత సైన్యం జరిపిన మెరుపు దాడి.. పాకిస్తాన్ డ్రోన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనడం చూపిన ప్రపంచ దేశాలు షాక్ అయ్యాయి. ఇదే సమయలో మనకు మిత్రులు ఎవరు.. శత్రువులు ఎవరు అన్నది నిర్ధారణ అయింది. దీంతో మనం మరింత సమర్థవంతంగా, శక్తివంతంగా కావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలో కేంద్రం ఇప్పటికే ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా సరికొత్త ఆయుధాలు రూపొందిస్తోంది. విదేశాల నుంచి కూడా సరికొత్త టెక్నాలజీ ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. తాజాగా 850 ఆత్మాహుతి డ్రోన్ల కొనుగోలు తుది దశకు చేరింది. డిసెంబర్ చివర్లో రక్షణ మంత్రిత్వ శాఖ సమావేశంలో ఆమోదం లభించనుంది. పహల్గాం దాడి తర్వాత అప్రమత్తత పెరిగిన సందర్భంలో, ఈ డ్రోన్లు ప్రాణనష్టం లేకుండా శత్రు లక్ష్యాలను నిర్మూలిస్తాయి. భవిష్యత్తులో 30 వేల డ్రోన్ల సమకూర్జన ప్రణాళికలో ఇది మొదటి దశ.
ఆత్మాహుతి డ్రోన్ల విశేషాలు..
నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ అభివృద్ధి చేసిన ఈ డ్రోన్లు 1,000 కి.మీ. దూరం ఎగురుతాయి. రాడార్‌లకు తప్పిపోయి లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో ఇలాంటి ఆయుధాలు ప్రధాన పాత్ర పోషించాయి. రెండామూల ప్రపంచ యుద్ధంలో జపాన్ కామికాజే విమానాల్లా ఈ డ్రోన్లు పనిచేస్తాయి.
అశనీ దళంగా సైనిక వ్యూహం..
పదాతి దళం ప్రతి ప్లాటూన్‌కు 10 డ్రోన్లతో ’అశనీ’ దళాలు ఏర్పాటు చేయనుంది. గుంపుగా ప్రయోగిస్తూ కొన్ని నిఘా చేస్తూ, మిగతావి దాడి చేస్తాయి. పేలుడు పదార్థాలు మోసుకెళ్లి రాడార్‌లకు తప్పుకుని దాడి చేస్తాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని కమెంగ్ రంగంలో సైన్యం ప్రయోగాత్మక పరీక్షలు పూర్తి చేసింది. క్రమంగా వాయుసేన, నౌకాదళాల్లోకి తీసుకువస్తారు.
ఏప్రిల్ 22 పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్ డ్రోన్లు ప్రయోగించింది. భారత్ వాటిని అడ్డుకున్నప్పటికీ, భవిష్యత్ ముప్పులను ఎదుర్కొనేందుకు డ్రోన్ శక్తి పెంచుకుంటోంది.