BookMyShow: ఒక సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలుపడానికి దర్శకుడు మంచి కథను రెడీ చేసుకొని స్క్రీన్ మీద ప్రేక్షకుడికి నచ్చే విధంగా ప్రజెంట్ చేయాల్సిన అవసరమైతే ఉంది. సినిమా ఎలా ఉన్నా కూడా దాని ప్రమోషన్స్ కూడా చాలా ముఖ్యమని కొన్ని సినిమాల రిజల్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది… సినిమా ఎంత బాగున్నప్పటికీ దానికి సరైన ప్రమోషన్స్ చేయాలో లేకపోతే సినిమాను ఎవరు పట్టించుకోరు. ఇక ఇలాంటి క్రమంలోనే బుక్ మై షో లో సైతం టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు ఆ సినిమాకి ఎంత రేటింగ్ ఉంది అనే విషయాలను చూసి సినిమాని బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక దీనికోసం బుక్ మై షో వాళ్ళు ఫేక్ రేటింగ్ కూడా ఇస్తారట. దానికోసం విపరీతమైన డబ్బులను కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారని ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రొడ్యూసర్ అయిన ‘ధీరజ్ మోగిలినేని’ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…
సినిమా రిలీజ్ రోజు మీ సినిమాకి 9 రేటింగ్ ఇస్తామని బుక్ మై షో వాళ్ళు ప్రొడ్యూసర్ల దగ్గర 5 నుంచి 10 లక్షల వరకు డబ్బులను తీసుకుంటారట. వాళ్లు తీసుకున్న డబ్బులకు సినిమా ఆడినన్ని రోజులు హై రేటింగ్ ఇస్తారు అనుకుంటే పొరపాటే… కేవలం వీకెండ్ రోజులకు మాత్రమే ఈ రేటింగ్ ఇస్తారట.
ఇక రెండు మూడు రోజుల తర్వాత మరికొన్ని డబ్బులను ఇస్తేనే ఆ రేటింగ్ ను మైంటైన్ చేస్తామని లేకపోతే రేటింగ్ డౌన్ చేస్తామని చెబుతారట. రేటింగ్ తగ్గితే సినిమా మీద నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశ్యంతో ప్రొడ్యూసర్లు అదే రేటింగ్ ను మెయింటైన్ చేయడానికి దాదాపు 20 నుంచి 30 లక్షల వరకు బుక్ మై షో వాళ్లకే పెట్టాల్సి వస్తుంది.
అంటూ ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశాడు. మొత్తానికైతే ప్రొడ్యూసర్లకు అన్ని చోట్ల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి చాలామంది ప్రొడ్యూసర్లు సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు…తద్వారా వీళ్ళందరూ వాళ్ళ స్వార్థానికి సినిమాలను చంపేస్తున్నారు…