ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి అడుగుపెట్టే ముందు భారీ PR టీం ని సెట్ చేసుకొని వస్తారు. అంతే కాకుండా తమకు స్నేహితులుగా ఉన్న సెలబ్రిటీలను సపోర్టు చేయమని కోరుతారు. ఇవి రెండు లేకుండా హౌస్ లోకి వస్తే ఎక్కువ రోజులు కొనసాగడం కష్టం. సామాన్యులుగా అడుగుపెట్టిన మర్యాద మనీష్, ప్రియా, శ్రీజ, పవన్ కళ్యాణ్ పడాల వంటి వారు కూడా భారీ పీఆర్ టీం ని సెట్ చేసుకొని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఒక్క డిమోన్ పవన్ మాత్రమే ఎలాంటి PR టీం ని పెట్టుకోకుండా హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఇతనికి వీకెండ్ లో వచ్చే కాస్ట్యూమ్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు, ప్రతీ వారం తన స్నేహితులే ఈయనకు బట్టలు కోసం సహాయం చేసేవారు. చాలా పేదరికం నుండి వచ్చిన అబ్బాయి.
కానీ హౌస్ లో ఉన్నన్ని రోజులు తన పేదరికం గురించి ఎప్పుడూ చెప్పుకోలేదు. పవన్ కళ్యాణ్ పడాల లాగా సానుభూతి పొందే ప్రయత్నం కూడా చేయలేదు. కేవలం తన టాలెంట్ ని నమ్ముకున్నాడు, టాప్ 3 వరకు వచ్చాడు. తెలుగు బిగ్ బాస్ చరిత్ర లో ఒక సామాన్యుడు ఎలాంటి పీఆర్ సపోర్ట్ లేకుండా హౌస్ లోకి అడుగుపెట్టి టాప్ 3 వరకు వచ్చిన సందర్భాలే లేవు, ఒక్క డిమోన్ పవన్ తప్ప. రీతూ చౌదరి తో లవ్ ట్రాక్ ఉండడం వల్ల, తనని తానూ పూర్తిగా ఆడియన్స్ కి చూపించుకోలేకపోయాడు. ఆమె ఎలిమినేట్ అయ్యాక డిమోన్ తనలోని యాంగిల్స్ మొత్తాన్ని బయటకు తీసాడు. అది ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. అందుకే టాప్ 3 లో కూర్చోబెట్టారు. ఇలాగే అతను మొదటి వారం నుండి ఉండుంటే, ఇతని దరిదాపుల్లో కూడా మరో కంటెస్టెంట్ ఉండేవాడు కాదు. ఆ రేంజ్ టాలెంట్ ఉన్న కంటెస్టెంట్.
అంతే కాదు, సరైన సమయం లో తన తెలివి, సమయస్ఫూర్తి ని ఉపయోగించి ఏకంగా 15 లక్షల రూపాయిల సూట్ కేసు ని తీసుకొని బయటకు వచ్చేశాడు. ఆ 15 లక్షలు మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ డబ్బులు అతను తీసుకొని ఉన్నా తప్పు లేదు. అంతటి తోపు కంటెస్టెంట్. తన ఆర్ధిక స్తొమత తెలుసు, డబ్బులు అవసరం ఉంది కాబట్టే, ‘నన్ను పూర్తిగా జనాలకు మొదటి వారం నుండి చూపించుకోలేకపోయాను, అందుకే టాప్ 3 వద్దే ఆగిపోతానేమో అనిపిస్తుంది. అందుకే ఏ ప్రైజ్ మనీ ని తీసుకుంటున్నాను, దయచేసి ఆడియన్స్ నన్ను క్షమించండి’ అని చెప్పి సూట్ కేసు తీసుకొని తన అభిమానులను సంతృప్తి పరిచాడు డిమోన్ పవన్. టాలెంట్ పవర్ హౌస్ గా పేరు తెచ్చుకున్న ఈ చిచ్చర పిడుగు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.