Raj Subramaniam New CEO Of FedEx: అంతర్జాతీయంగా పనిచేస్తున్న ప్రముఖ కంపెనీలకు మన ఇండియన్లు సీఈవోలుగా మారుతూ.. దేశ గౌరవాన్ని పెంచుతున్నారు. తాజాగా ఈ లిస్టులో మరో వ్యక్తి చేరిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన కొరియర్ డెలివరీ సంస్థ అయిన ఫెడెక్స్‌కు ఇండియన్ అమెరికన్ అయిన సుబ్రమణియం సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతం సంస్థ అధ్యక్షుడు, సీఈవో అయిన ఫ్రెడెరిక్ డబ్ల్యూ స్మిత్ జూన్ 1 నుంచి సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో సుబ్రమణియం సీఈవోగా నియమితులు కానున్నారు. ఈ విషయాన్ని ఫెడెక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఫెడెక్స్‌ను 1971లో స్మిత్ ప్రారంభించారు. కాగా ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఆరు లక్షల మంది సిబ్బందితో విజయవంతంగా నడుస్తోంది.
Also Read: Best Dialogues From KGF Series: `కేజీఎఫ్` సిరీస్ నుంచి వచ్చిన బెస్ట్ డైలాగ్స్
ఈ సంస్థతో సుబ్రమణియంకు దాదాపు 30 ఏండ్ల అనుభవం ఉంది. ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా, కమ్యూనికేషన్ ఆఫీసర్ గా కూడా పనిచేశారు. ఎక్స్ ప్రెస్ అధ్యక్షుడిగా కూడా చేసిన అనుభవం సుబ్రమణియంకు ఉంది. 2020లో ఆయన బోర్డు సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్టపి వరకు అలాగే కొనసాగుతున్నారు. ఇకపైనా కొనసాగనున్నారు.
కేరళలోని తిరువనంతపురానికి చెందిన సుబ్రమణియం.. చిన్నప్పటి నుంచే చాలా చురుగ్గా ఉండేవారు. బాంబేలోని ఐఐటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత అమెరికాలోని సిరక్యూస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఆ తర్వాత ఉద్యోగ రీత్యా అమెరికాలోనే ఉండిపోయిన ఆయన.. తన కెరీర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతూ.. ఇప్పుడు సీఈవో స్థాయికి చేరుకున్నారు.
ఫ్రెడెరిక్ ఎంతో సమర్థవంతమైన నాయకుడు అని.. ఆయన కంపెనీలో పనిచేయడం తనకు ఆనందంగా ఉందంటూ తెలిపారు సుబ్రమణియం. ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వివరించాడు సుబ్రమణియం.
Also Read: Interesting Facts About Oscar Awards: ‘ఆస్కార్ అవార్డ్’ దేనితో తయారు చేస్తారు ? దాని విలువ ఎంత ?
Recommended Video: