Best Dialogues From KGF Series: షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిస్తున్న `కేజీఎఫ్’ సిరీస్ లో డైలాగ్స్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాయి. అవుతున్నాయి. అందుకే.. ఈ సినిమా రెండు పార్ట్ లకు సంబంధించిన డైలాగ్స్ లో బెస్ట్ డైలాగ్స్ మీ కోసం.
అవును సార్..
మీరన్నట్టే మాకు
ధైర్యం వుండేది కాదు,
శక్తి వుండేది కాదు,
నమ్మకమూ వుండేది కాదు
Also Read: SS Rajamouli First Movie: రాజమౌళి మొదటి సినిమా ఏదో తెలుసా.. విడుదలకు నోచుకోలేదు..
చావు మా మీద గంతులేసేది
కానీ ఒకడు అద్దం నిలబడ్డాడని వాడ్ని కాళి ముందు తల నరికాడు కదా
ఆ రోజు చాలా సంవత్సరాల తరవాత
చావు మీద మేము గంతులేశాం
వాడు కత్తి విసిరిన వేగానికి
ఒక గాలి పుట్టింది సార్
ఆ గాలి నారాచి లో వున్న ప్రతి ఒక్కరికీ ఊపిరిచ్చింది
మీకోక సలహా ఇస్తా
మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్
గ్యాంగ్ తో వచ్చే వాడు గ్యాంగ్స్టర్.
కానీ అతనొక్కడే వస్తాడు, Monster.
ఊరికే చరిత్ర సృష్టించలేము.
అలా అని చరిత్రను ప్లాన్ వేసి బ్లూప్రింట్ తీయలేము.
దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పు రవ్వ
నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు.
కాని చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజు లాగా,
పెద్ద శ్రీమంతుడిగా చచ్చిపోవాలి.
ప్రపంచంలో తల్లికి మించిన యోధులెవరు లేరు.
చిల్లర కావాలంటే చెయ్యి చాపాలి.
అదే నోట్లు కావాలంటే చెయ్యి లేపాలి.
పోలీసులు విజిల్ వేసి పట్టుకున్న క్రిమినాల్ని, జనాలు విజిల్ వేసి రాజాని చేసారు.
అందరు డబ్బులు ఉంటే హాయిగా బతకవచ్చు అనుకుంటారు. అయితే డబ్బులు లేకపోతే చావు కూడా ప్రశాంతంగా అవ్వదని ఎవరూ ఆలోచించరు.
చట్టం చేతికి ఉంగరం తొడిగా, అది షేక్ హ్యాండ్ ఇస్తుంది. సలాము కొడుతుంది.
రక్తపు వాసనకి పిరానా చేపలన్నీ ఒక చోట చేరాయి. అయితే ఆ చేపలకు తెలియదు, ఆ రక్తం వాటిని వేటాడే తిమింగలానిదే అని.
నా జర్నీ లో చాలామంది కిలాడీలని చూసా. కిల్ లేడీ ని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్న.
స్వార్ధంతో పరుగులు తీసే ప్రపంచం, ఎవరి కోసం ఆగదు. మనమే దాన్ని ఆపాలి.
వేరే వాళ్ళ గురించి ఆలోచించవద్దు. వాళ్ళు నీకన్నా గొప్పోళ్ళు కారు.
ఊరు చూడటానికి వచ్చినోడు ఊరు తెలుసుకుంటాడు. ఊరు ఏలటానికి వచ్చినోడు వాడి గురించి ఊరుకి తెలిసేలా చేస్తాడు.
ట్రిగ్గర్ మీద వేలు పెట్టిన ప్రతోడు షూటర్ కాదు. అమ్మాయి మీద చెయ్యి వేసిన ప్రతోడు మగాడు కాదు.
ప్రతి సినిమాలో ఒకడుంటాడు అంట కదా, నిన్ను చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది.
హీరో నా..??
కాదు, విలన్..!!
పోస్ట్ వచ్చేది లెటర్ మీద వున్నా అడ్రసును బట్టి కాదు, అడ్రస్ మీద వుండే ల్యాండ్ మార్క్ ని బట్టి. ఈ ల్యాండ్ మార్క్ కి పిన్ కోడే కాదు, స్టాంప్ కూడా అవసరంలా. నా అర్హత ఏమిటి అనేది నన్ను ప్రేమించి వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి అర్ధం కాదు.
ఎవడురా జనాన్ని కొట్టి డాన్ అయ్యాను అని అంది. నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే.
గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస, గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది..!
కొట్లాటలో ముందు ఎవడి మీద దెబ్బ పడిందన్నది కాదు. ముందు ఎవడు కింద పడిపోయాడన్నది లెక్కలోకి వస్తుంది.
జీవితంలో భయముండాలి. ఆ భయం గుండెలో ఉండాలి. అయితే ఆ గుండె మనది కాదు. మన ఎదుటోడిదయే ఉండాలి.
కాల్చే మంటను ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుమజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుడిని ఎదురించిన రాముడిలా, జమదగ్ని కోపాన్ని మించి, సర్వము తననుకునే పరమాత్మని ప్రశ్నించే, పిడుగులా గర్జించే ఒక ధీరుడు వస్తున్నాడు.
నీ వెన్నంటి వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే నువ్వొక్కడివే గెలుస్తావ్. అదే ముందు ఉన్నావని నీ వెనుకున్న వేలమందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్నే గెలుస్తావ్. .
ఈడ స్వర్గం నరకం లేవు. మంచి చెడులు లేవు. నమ్మకాలూ కూడా లేవు. భావోద్వేగానికి లొంగిపోకు. ఈడా ఆటికి విలువ లేదు. గుండెల్ని రాయి చేసుకున్నోడికి ఇవన్నీ వుండవు.
బెదిరి అదిరి చెదిరి పోయే సుక్కల్లో సందమామ లాగా, ఆకాశం చీర అంచుల్లో దాక్కుని కూర్చున్నప్పుడు, జ్వాల కన్నది ఒక జ్వాలా పుత్రుడిని.
రక్తంతో రాసిన కథ ఇది..! సిరాతో ముందుకి తీసుకెళ్ళలేవ్. ముందుకెళ్లాలంటే మళ్ళీ రక్తాన్నే అడుగుతుంది.
అక్కడ పడే పీనుగులు కూడా పనికొస్తాయి. కావాలంటే రాబందులని అడుగు !
Also Read: Interesting Facts About Oscar Awards: ‘ఆస్కార్ అవార్డ్’ దేనితో తయారు చేస్తారు ? దాని విలువ ఎంత ?
Recommended Video: