India VS Pakistan : భారత్ ఆ నిర్ణయం తీసుకుని అంతమాత్రాన పాకిస్తాన్ దేశానికి రాత్రికి రాత్రే సింధుజలాలు నిలిచిపోవు. ఇలా రాయడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇది నిష్టూరమైన సత్యం. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసినంతమాత్రాన పాకిస్తాన్ దేశంలో దుర్భర దారిద్రం తాండవించదు. కాకపోతే పాకిస్తాన్లో ఇప్పటికే భూగర్భ జలాల క్షీణత అధికంగా ఉంది. పాకిస్తాన్ దేశంలో ప్రధాన నగరమైన కరాచీలో ఇప్పటికే తాగునీటి కొరత అనేది తీవ్రంగా ఉంది. అక్కడ ప్రజలు తాగు నీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. భారత్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి.. మిగులు జలాలు పాకిస్తాన్ వెళ్ళడానికి అవకాశం ఉండకపోవచ్చు. సింధు నది ప్రవాహం భారత్ మీదుగా సాగుతుంది. పాకిస్తాన్ భారత్ కంటే దిగువన ఉంది. అప్పుడు వర్షాలు భారీగా కురుస్తున్న సమయంలో నది ప్రవాహాన్ని భారత్ అడ్డుకోలేదు. అప్పుడు పాకిస్తాన్ కచ్చితంగా సింధు నది నీటిని గ్రహించగలుగుతుంది.. సింధు మాత్రమే కాదు జీలం, చీనాబ్ నదులు కూడా పాకిస్తాన్ కు ప్రవహిస్తాయి. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఆ నదుల ప్రవాహానికి దిగువన ఉంది. పాకిస్తాన్ లో 80% వ్యవసాయం సింధు, జీలం, చీనాబ్ నదుల మీదే ఆధారపడి ఉంది.. ముఖ్యంగా పంజాబ్, సింధు ప్రావిన్స్ లలో 85% వ్యవసాయం సింధూ నది ఆధారంగానే సాగుతుంది. వ్యవసాయం ద్వారా పాకిస్తాన్ ఖజానాకు 25 శాతం ఆదాయం వస్తోంది. అంతేకాదు పాకిస్తాన్లో 70 శాతానికి మించిన గ్రామీణ జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడుతోంది. ఇప్పుడు భారత్ సింధు జలాల ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవడం ద్వారా.. కరాచీ లాంటి నగరాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉంది.. అంతేకాదు వ్యవసాయం కూడా తీవ్రంగా ప్రభావితం కానుంది. అప్పుడు ఆ దేశంలో ఆహార కొరత ఏర్పడుతుంది. ఆర్థిక అస్థిరతకు కూడా దారి తీస్తుంది.
Also Read : పహల్గాం ఉగ్రదాడి.. కశ్మీరీలకు ఉపాధి కరువైంది..
సమయం పడుతుంది
సింధూ నది జలాల ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవడం ద్వారా భారత్.. సింధు నది జలాలను పూర్తిస్థాయిలో వాడుకునే అవకాశం లేదు. ఎందుకంటే సింధూ నది ప్రవాహం వెంట భారత్ కొంతమేర మాత్రమే ప్రాజెక్టులు నిర్మించింది. ఆ నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేయాలంటే భారీ స్థాయిలో ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల ప్రకారం 5 నుంచి 10 శాతం వరకు మాత్రమే నీటిని నిల్వ చేయడానికి అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం పహల్గామ్ ఘటన తర్వాత భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో సింధూ నది పరివాహక ప్రాంతంలో భారీగా ప్రాజెక్టులు నిర్మించే అవకాశం ఉంది. అయితే వీటిని నిర్మించేందుకు ఒక దశాబ్దం కాకపోయినప్పటికీ.. కొన్ని సంవత్సరాలైనా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టులు నిర్మించడానికి ముమ్మరంగా సర్వేలు చేయాలి. నిధుల లభ్యత కూడా కావాలి.. భారత్ తీసుకున్న నిర్ణయంతో సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. ” ఇది రేపటి నీటిని ఆపడం గురించి కాదు. ఇప్పటికీ ప్రాజెక్టు గేటు తెరిచే ఉంది. కాకపోతే దాని వెనుక ఉన్న అడ్డంకి మాత్రమే ఎత్తివేశారు” అని ఓ నెటిజన్ రాశాడు.
Also Read : పహల్గాం దాడి.. భారత్ ముందు ఉన్న ప్రతీకార వ్యూహాలు ఇవీ..