Deputy CM Pawan Kalyan : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో(Pithapuram) ఈమధ్య ఎక్కువగా టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతుండడం మేమంతా చూస్తూనే ఉన్నాం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో నాగ బాబు మాట్లాడిన కొన్ని మాటలే ఈ గొడవలకు కారణం అనుకోవచ్చు. ఇన్ని రోజులు పిఠాపురం లో ఎన్ని గొడవలు జరిగినా నేడు పవన్ కళ్యాణ్ పర్యటనలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మతో(SVSN Varma) ఎంతో సాన్నిహిత్యం గా మెలుగుతూ కనిపించడం కూటమి అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. పిఠాపురం లో నేడు వంద కోట్ల రూపాయిల విలువైన పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసాడు. ఎన్నో దశాబ్దాల నుండి పిఠాపురం ప్రజలు వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నేడు ఆ బృహత్తర కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసాడు. అదే విధంగా టీటీడీ కల్యాణ మండపం తో పాటు ఉప్పాడలో పలు దేవాలయాల శంకుస్థాపన చేసాడు.
Also Read : ఏపీలో పాకిస్తాన్ కాలనీ.. తాజాగా పేరు మార్చేశారు తెలుసా?
అన్ని కార్యక్రమాలు ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగాయి. కానీ ఒకే ఒక్క విషయం లో మాత్రం పిఠాపురం వర్మ కు మరోసారి అవమానం జరిగింది. అంబెడ్కర్ భవన్ లో పవన్ కళ్యాణ్ మహిళలకు కుట్టు మెషిన్స్, రైతులకు పని ముట్లు ఉచితంగా పంపిణీ చేసాడు. ఈ కార్యక్రమంలో వర్మ పాల్గొనడానికి వస్తే, ఆయనకు అంబెడ్కర్ భవనం లో అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు వర్మకు, పోలీసులకు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అందుకు సంబంధించిన వీడియోని మనం క్రింద చూడవచ్చు. దాదాపుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న వర్మ, అంబెడ్కర్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఈరోజు విడుదల చేసిన వీడియోలలో కూడా అంబెడ్కర్ భవన్ లో జరిగిన కార్యక్రమాల్లో వర్మ కనిపించడు. ఈ విషయం లో టీడీపీ అభిమానులు కాస్త బాధపడ్డారు.
VIP లకు అనుమతి లేదంటూ వర్మ ని ఆపేసారు. ఇది పవన్ కళ్యాణ్ నుండి నేరుగా వచ్చిన ఆదేశాలా?, లేకపోతే ప్రోటోకాల్ కోసం పోలీసులే ఆపించారో. ప్రతీ కార్యక్రమంలోనూ వర్మ ని తన వెంటపెట్టుకొని వెళ్లిన పవన్ కళ్యాణ్, ఈ ఒక్క కార్యక్రమం లో ఎందుకు వద్దు అంటాడు?, కచ్చితంగా ఇది పోలీసులే ఆపి ఉంటారని సోషల్ మీడియా లో పవన్ అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ ఒక్క విషయం లో కాస్త వర్మ అసహనం చూపించినప్పటికీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అతనికి ఇచ్చిన ప్రాధాన్యతకు వర్మ చాలా సంతోషించాడు. ముఖ్యంగా రిబ్బన్ కటింగ్ సమయం లో వర్మ మొహమాటం పడుతూ చెయ్యి దూరం గా పెట్టగా, పవన్ కళ్యాణ్ అతని చెయ్యి ని దగ్గరకు లాగి పట్టుకున్నాడు. ఇలా ఎన్నో సంఘటనలు నేడు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్, వర్మ కలయిక పిఠాపురం లో టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తల మధ్య చెలరేగిన మంటల్ని ఆర్పుతుందో లేదో చూడాలి.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ‘హిట్ 3’ అడ్వాన్స్ బుకింగ్స్..ట్రెండ్ ఎలా ఉందంటే!
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం
అంబేడ్కర్ భవన్ లో వీఐపీలకు ప్రవేశం లేదని వర్మను అడ్డగించిన ఎస్పీ pic.twitter.com/ojU7fDEdXT
— Telugu360 (@Telugu360) April 25, 2025