Manchu Vishnu : మంచు విష్ణు(Manchu Vishnu) ఇచ్చే ఇంటర్వ్యూస్, ప్రసంగాలు కాస్త సోషల్ మీడియా లో వివాదాలకు దారి తీసిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. ఈయన మీద సోషల్ మీడియా లో వచ్చినన్ని ట్రోల్స్ ఏ సెలబ్రిటీ మీద కూడా రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie) జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. చాలా రిస్క్ చేసి మోహన్ బాబు ఈ చిత్రం కోసం దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేసాడు. ఏప్రిల్ నెలలోనే ఈ సినిమాని విడుదల చేయాల్సింది కానీ, గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం అవ్వడంతో వాయిదా వేశారు. అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ ని అప్పుడే ప్రారంభించాడు మంచు విష్ణు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో ప్రభాస్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read :స్పీడ్ పెంచిన అనుష్క..ఏకంగా 7 సినిమాలకు గ్రీన్ సిగ్నల్..రెమ్యూనరేషన్ ఎంతంటే!
ఆయన మాట్లాడుతూ ‘నా దృష్టిలో ప్రభాస్(Rebel Star Prabhas) ఒక మామూలు నటుడు మాత్రమే. లెజండరీ స్థాయికి ఆయన ఇంకా చేరుకోలేదు, అందుకు చాలా సమయం ఉంది. కానీ మోహన్ లాల్ గారు మాత్రం లెజండరీ నటుడు. ఎందుకంటే కాలం ఆయన్ని లెజెండ్ ని చేసింది. భవిష్యత్తులో కచ్చితంగా ప్రభాస్ కూడా ఆయన తీస్తున్న సినిమాల కారణంగా లెజెండ్ స్థాయికి చేరుకుంటాడు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది మండిపడుతుంటే, మరి కొంతమంది వయస్సు ని ఆదారంగా చేసుకొని విష్ణు అలా మాట్లాడి ఉంటాడని అంటున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. వీళ్ళెవ్వరూ కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కేవలం మోహన్ బాబు మీద అభిమానంతో చేస్తున్నారు.
ప్రభాస్ ఈ చిత్రం లో దాదాపుగా అరగంట పాటు కనిపిస్తాడట. ఆయన సన్నివేశాలు అభిమానులకు గూస్ బంప్స్ రప్పించే విధంగా ఉంటాయని అంటున్నాడు మనోజ్. అయితే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ, విడుదల చేసిన రెండు టీజర్స్ కి రెస్పాన్స్ మాత్రం పెద్దగా రాలేదు. విష్ణు తన నటనలో పరిణీతి చూపించలేకపోయాడని టీజర్ ని చూసిన వాళ్ళు అంటున్నారు. అదే విధంగా టీజర్స్ లో కనిపించిన లొకేషన్స్ మన తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా లేవని, ఎదో పార్క్ లో షూటింగ్ చేసినట్టుగా ఉందని కొందరు విమర్శించారు. చూడాలి మరి సినిమాలో అయినా కన్నప్ప క్యారక్టర్ లో లీనపై నటించాడా లేదా అనేది. ప్రభాస్, మోహన్ లాల్ వంటి వారు ఉన్నారు కాబట్టి, మొదటి రోజు ఓపెనింగ్స్ విషయం లో మాత్రం ఎలాంటి భయం పెట్టుకోనవసరం లేదు.
#Prabhas is a normal actor for me#Mohanlal is a Legend
– Manchu Vishnu https://t.co/ttMz9lmK5F pic.twitter.com/mn2kPt1zob— Nag Mama Rocks (@SravanPk4) April 24, 2025